కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో మహిళల పట్ల అభ్యంతర వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌కు ఊరట లభించింది. ఆసీస్ పర్యటనలో వున్న వీరిని అర్థాంతరంగా వెనక్కి పిలిపించడమే కాకుండా తర్వాత సిరీస్‌లకు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఇద్దరి తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పారు. అయినా ఈ వివాదం కొలిక్కి రాలేదు.
తాజాగా ఈ వ్యవహారంలో వీరిద్దరికీ ఊరట లభించింది. హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లపై విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు నియమించిన పాలకమండలి ఎత్తివేసింది. వీరిద్దరిపై నిషేధాన్ని ఎత్తివేయాలని బీసీసీఐ సహా.. పలువురు మాజీ క్రికెటర్లు పాలకమండలిని కోరారు.
ఫలితంగా వీరిద్దరిపై బీసీసీఐ నిషేధం ఎత్తివేసింది. దీంతో తర్వాతి సిరీస్‌లలో హార్దిక్ పాండ్యా, రాహుల్‌లకు ఆడే అవకాశం ఉందని సమాచారం. మరికొన్ని నెలల్లో వరల్డ్ కప్ ఉండడంతో ఈ తీర్పు వాళ్ళ కెరీర్‌లను నిలబెట్టిందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.