Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హార్దిక్ పాండ్యాకు ఎదురుదెబ్బ.. సభ్యత్వం రద్దు...

Advertiesment
Khar Gymkhana
, బుధవారం, 16 జనవరి 2019 (10:10 IST)
భారత క్రికెట్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ముంబైలో ఉన్న ప్రతిష్టాత్మక ఖర్ జింఖానా క్లబ్ గౌరవ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ మేరకు ఇటీవల జరిగిన కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఖర్ జింఖానా సంయుక్త కార్యదర్శి గౌరవ్ కపాడియా వెల్లడించారు. 
 
కాఫీ విత్ కరణ్ అనే టీవీ కార్యక్రమంలో సహచర క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో కలిసి పాల్గొన్న హార్దిక్ పాండ్యా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీంతో పాండ్యాతో పాటు.. రాహుల్ కూడా జట్టులో చోటు కోల్పోయారు. వీరిద్దరిపై బీసీసీఐ క్రమశక్షణా చర్యలు తీసుకుంది. ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్థాంతరంగా వెనక్కి పిలిపించింది. పైగా, వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని బీసీసీఐ షోకాజ్‌ నోటీసులు జారీ చేయగా.. పాండ్యా, రాహుల్‌ బేషరతుగా క్షమాపణ చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19 యేళ్ళ వయసులో డేటింగ్‌కు వెళ్ళా.. అమ్మాయిని చూసి పరుగో పరుగు...