వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజయం దిశగా దూసుకెళుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ టాప్ లేపిన బుమ్రా (6/27) మూడో రోజు ఒక్క వికెట్ కూడా తీయలేదు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన బుమ్రా.. నేను వికెట్లు తీయకున్నప్పటికీ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తెస్తాననీ, జట్టు విజయానికి నా వంతు ప్రయత్నం చేస్తానన్నారు.
మా సీనియర్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని అన్నారు. ఇషాంత్, షమీ అనుభవమున్న ఆటగాళ్లనీ, వాళ్లకు నా వంతు సాయం చేస్తానన్నారు. మొత్తానికి జట్టు విజయం సాధించడమే అంతిమ లక్ష్యమన్నారు.
ఈ మ్యాచ్‌లో బుమ్రా హ్యాట్రిక్ తీసిన విషయం తెల్సిందే. దీంతో బుమ్రాన్‌ను విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ చేశాడు. బుమ్రాకు హ్యాట్రిక్ తీసినందుకు కంగ్రాట్స్ చెప్పగా.. ఈ ఘనత మీకే(విరాట్) చెందుతుందన్నాడు. దీంతో, కోహ్లి ఒక్కసారిగా పగలబడి నవ్వాడు. కాదు ఆ ఘనత ఎప్పటికీ నీదేననీ, నీవు అద్భుతంగా బౌలింగ్ వేయబట్టే అరుదైన ఘనత నీ దరి చేరిందని కోహ్లి ఈ సందర్భంగా బుమ్రాతో అన్నాడు.
కాగా, బుమ్రా రోస్టన్ చేజ్‌కు బంతి వేయగా అది అతని ప్యాడ్‌లను తాకింది. బుమ్రా ఎల్బీ కోసం ఎంపైర్‌కు అప్పీల్ చేయగా, ఆయన తిరస్కరించాడు. దీంతో రహేనే, బుమ్రాతో చర్చించి కోహ్లి రివ్యూకు వెళ్లగా చేజ్ ఔటయినట్లు తేలింది. దీంతో బుమ్రా సహా జట్టు సభ్యులంతా సంబరాలు చేసుకున్నారు.