వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్టు జట్టు ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే తొలి టెస్ట్ మ్యాచ్‌ను కైవసం చేసుకున్న కోహ్లీ సేన.. రెండో టెస్టులో కూడా 468 రన్స్‌ను లక్ష్యంగా ఉంచింది.
భారత క్రికెట్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 157/4 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తద్వారా విండీస్ ముందు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు, కెప్టెన్ కోహ్లి త్వరగా ఔటయినప్పటికీ, సిరీస్ సెంచరీ హీరోలు రహానే(64), విహారీ(53) శతక(111) భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.
విండీస్ స్పీడ్‌స్టర్ కీమర్ రోచ్ కోహ్లి సహా ఓపెనర్లను త్వరగానే పెవిలియన్ పంపించాడు. కోహ్లీని గోల్డెన్ డకౌట్ చేశాడు. అయినప్పటికీ వైస్ కెప్టెన్ రహానే.. విహారీతో ఇన్నింగ్స్‌ను సాఫీగా నడిపించాడు. భారత్ 157 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
468 పరుగుల లక్ష్య సాధనలో బరిలోకి దిగిన విండీస్ మూడో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి 45/2తో నిలిచింది. విండీస్ విజయం సాధించాలంటే ఇంకా 423 పరుగులు సాధించాలి. నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంత భారీ టార్గెట్ సాధించడం దాదాపు అసాధ్యం. దుర్భేధ్యంగా ఉన్న ఇండియా పేస్ దళాన్ని తట్టుకోవడం విండీస్‌కు కష్టమే. ఇప్పటికే రెండు వికెట్లు కోల్పోయింది.