టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టిన రోజు ఆగష్టు 29న అనే విషయం తెలిసిందే. ఇది నాగార్జునకు 60వ పుట్టినరోజు. కనుక... ఈ సంవత్సరం నాగార్జునకు చాలా చాలా స్పెషల్. అందుచేత అభిమానులు కూడా పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్‌గా చేయాలని ప్లాన్ చేసారు. అయితే... నాగార్జున అస్వస్థతకు గురయ్యారని ఓ వార్త బయటకు వచ్చింది. దీంతో అసలు నాగార్జునకు ఏమైంది..? అసలు పుట్టినరోజు వేడుకలు ఉన్నాయా..? లేవా అనేది ఆసక్తిగా మారింది.
అసలు విషయం ఏంటంటే... మన్మథుడు 2 సినిమా ఫ్లాప్ అవ్వడంతో నాగార్జున పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలనుకున్నారట. అందుచేత అభిమానులు నాగార్జునను కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటే... జ్వరంగా ఉంది అని చెప్పారట. దీంతో అభిమానులు నిరాశతో వెనుదిరిగారట. ఈ వార్త అలా..అలా తెలిసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తాజా సమాచారం ఏంటంటే.... నాగార్జున పుట్టినరోజు వేడుకలను చైతన్య, అఖిల్ స్పెయిన్‌లో ప్లాన్ చేసారట. పైగా ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్లాన్ అట. అందుకనే నాగ్ కూడా కాదనలేక ఓకే చెప్పాడట. ప్రస్తుతం నాగ్ ఫ్యామిలీ అంతా స్పెయిన్లో ఉన్నారు. వారం తర్వాతే హైదరాబాద్ రానున్నారని సమాచారం.