శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో దేశంలో అతిపెద్ద తెరతో కూడిన మల్టీప్లెక్స్ థియేటర్ గురువారం ప్రారంభం కానుంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి పక్కన పిండిపాళెంలో రూ.40 కోట్లతో సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించారు. దీని ప్రారంభోత్సవానికి గురువారం సినీనటుడు రామ్‌చరణ్ రానున్నట్లు తెలిసింది. ఈ థియేటర్‌లో ఈనెల 30న సాహో సినిమా విడుదల కానుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తయిన తెర, 656 సీట్ల సామర్థ్యంతో 3డీ సౌండ్ సిస్టమ్‌తో థియేటర్‌ను నిర్మించారు. ఇలాంటి థియేటర్లు ఆసియా ఖండంలో మరో రెండు ఉన్నాయి.
ప్రపంచంలోనే మూడో అతిపెద్దది, ఆసియాలోని అతిపెద్ద సిల్వర్ స్క్రీన్‌గా భావిస్తున్న మల్టీప్లెక్స్ థియేటర్ గురువారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ప్రారంభంకానుంది. ఇది సూళ్లూరుపేట పట్టణానికి సమీపంలోని చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి పక్కన పిండిపాళెంలో యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్‌లు, వీ సెల్యులాయిడ్ (వీ ఎపిక్) పేరిట మూడు స్క్రీన్ల సినీ కాంప్లెక్స్‌ను నిర్మించారు. దీనికోసం రూ.40 కోట్లను ఖర్చు చేశారు. ఈ థియేటర్‌ను గురువారం టాలీవుడ్ హీరో రామ్ చరణ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
ఈ థియేటర్‌లో ఈ నెల 30వ తేదీన ప్రభాస్ నటించిన "సాహో" సినిమా విడుదల కానుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా 106 అడుగుల వెడల్పు, 94 అడుగుల ఎత్తయిన తెర, 656 సీట్ల సామర్థ్యంతో త్రీ డైమన్షన్ సౌండ్ సిస్టమ్‌తో థియేటర్‌ను నిర్మించారు. ఇలాంటి థియేటర్లు ఆసియా ఖండంలో మరో రెండు ఉన్నాయి. మిగతా రెండు థియేటర్లనూ 180 సీట్ల సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం 7 ఎకరాల్లో ఈ థియేటర్లు ఉంటాయి.