Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 మ్యాచ్ : బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. హ్యాట్రిక్‌పై కన్ను

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (16:38 IST)
ఐసీసీ ట్వంటీ20 టోర్నీలో భాగంగా ఆదివారం భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య కీలక మ్యాచ్ ఆరంభమైంది. పెర్త్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని, హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది.
 
సూపర్-12, గ్రూపు బిలో ఉన్న భారత జట్టు ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆదివారం పటిష్టమైన సౌతాఫ్రికా జట్టుతో తలపడుతుంది. ఇందులో తొలుత టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ఏమాత్రం ఆలోచన చేయకుండా బ్యాటింగ్‌కు మొగ్గు చూపారు. 
 
ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఒక్క మార్పు చేశారు. అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాకు స్థానం కల్పించింది. అటు సౌతాఫ్రికా కూడా ఒక మార్పు చేశారు. స్పిన్నర్ షంసీని తొలగించి ఆయన స్థానంలో ఎంగిడీకి తుది జట్టులో చోటు కల్పించింది. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన తుది జట్ల వివరాలు.. 
భారత్ : రోహిత్ శర్మ, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ 
 
సౌతాఫ్రికా : టెంబా బవుమా, క్వింటన్ డికాక్, రిలీ రూసో, అయిడెన్ మర్ క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, పార్నెల్, కేశవ్ మహరాజ్, రబాడా, లుంగి ఎంగిడి, ఆన్రిస్ నోర్జే 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

కర్నూలులో దారుణం: చిన్నారి శరీరానికి రంగు పూసి భిక్షాటనకు రోడ్డుపై కూర్చోబెట్టారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

తర్వాతి కథనం
Show comments