ఆస్ట్రేలియాలో జరుగుతున్న ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జర్నీకి అడ్డుకట్ట పడిందనే చెప్పాలి. తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతుల్లో ఓడిన పాక్.. నిన్న జరిగిన రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చేతుల్లో ఓటమిని చవిచూసింది.
దీంతో పాక్ సెమీస్ అవకాశాలను క్లిష్టతరంగా మారాయి. బాబర్ సేన సెమీఫైనల్స్‌కు చేరాలంటే వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో.. ఇక ఆడబోయే మిగిలిన 3 మ్యాచ్‌లు కీలకం కానున్నాయి.
అంతేకాకుండా నెట్ రన్‌రేటు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ వైఫల్యాన్ని చూసి నవ్వుకున్న పాకిస్థానీలు.. ఇప్పుడు భారత్ గెలవాలంటూ కోరుకుంటున్నారు.
పాక్ సెమీస్ చేరాలంటే.. మిగతా మూడు మ్యాచ్‌ల్లో మెరుగైన రన్ రేట్‌తో విజయం సాధించాలి. అటు సౌతాఫ్రికాను భారత్ ఓడించాలి. ఇక జింబాబ్వే తన తదుపరి మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడాలి. అదే సమయంలో బంగ్లాదేశ్ మరో మ్యాచ్‌లో ఓడిపోవాలి. అంటే భారత్ ఈ మూడు జట్లు సౌతాఫ్రికా, బంగ్లా, జింబాబ్వేను ఓడించాలి.
ఇక సూపర్ 12లో భారత్ గనుక ఓడితే పాక్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినట్టే. అందుకే ఇప్పుడు భారత్ గెలవాలని పాక్ అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.