మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న సూపర్-12 మ్యాచ్‌లో టీమిండియాకు అర్షదీప్ శుభారంభాన్ని ఇచ్చాడు. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ దిగిన పాకిస్థాన్‌కు అర్షదీప్ చుక్కలు చూపించాడు.
లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్షదీప్ సింగ్ ఓపెనింగ్ స్పెల్‌లో విజృంభించాడు. పాకిస్థాన్ ప్రమాదకర ఓపెనర్లు కెప్టెన్ బాబర్ అజామ్ (0), మహ్మద్ రిజ్వాన్ (4)లను స్వల్ప స్కోర్లకే వెనక్కి పంపాడు.
తొలుత స్వింగ్ డెలివరీతో బాబర్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓ బౌన్సర్‌తో రిజ్వాన్‌ను బోల్తాకొట్టించాడు. దాంతో పాకిస్థాన్ 15 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది.
అయితే షాన్ మసూద్ మాత్రం అర్థసెంచరీతో అదరగొట్టాడు. పాక్ బ్యాట్స్‌మెన్లలో షాన్ మసూద్ (50), ఇఫ్తికార్ అహ్మద్ (51) ధీటుగా రాణించారు.
మిగిలిన వారంతా పది పరుగులు కూడా దాటలేకపోయారు. షహీన్ షా అఫ్రిది (16) పరుగులు సాధఝించాడు. దీంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది.