ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో శ్రీలంక భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తొమ్మిది వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది.
హోబర్ట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 128/8 స్కోరు చేసింది. లంక బౌలర్లలో హసరంగ, మహేశ్ తీక్షణ రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం శ్రీలంక 15 ఓవర్లలో 133/1 పరుగులు చేసి అలవోకగా గెలుపును నమోదు చేసుకుంది. ఓపెనర్ కుశాల్ మెండిస్(68 నాటౌట్) అర్ధ సెంచరీతో సత్తా చాటాడు. ధనంజయ డిసిల్వ (31), చరిత్ అసలంక (31 నాటౌట్) కూడా రాణించారు. కుశాల్ మెండిస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.