Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత దారుణ ఓటమి...

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (08:33 IST)
భారత్‌ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలో రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దీంతో మిగిలిన పోటీలు మరింత ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల మధ్య కీలక పోరు జరిగింది. ఇందులో డచ్ జట్టు అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది. ప్రపంచ కప్ చరిత్రలోనే ఘోర పరాజయం ఇదే కావడం గమనార్హం. ఆ జట్టు ఏకంగా 309 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఆసీస్ ఆటగాళ్లు మ్యాక్స్‌వెల్, వార్నర్‌లు చెలరేగిపోవడంతో నెదర్లాండ్స్ ఓటమి ఖరారైంది. అలాగే, మ్యాక్స్‌వెల్‌ 40 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసి మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. డేవిడ్ వార్న్ 104, మ్యాక్స్‌వెల్ 106, స్టీవ్ స్మిత్ 72, మార్నస్ 62 చొప్పున పరుగులు చేశారు. ఆ తర్వాత 400 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు కేవలం 90 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. ఆ జట్టు ఓపెనర్ విక్రమ్ జీత్ సింగ్ మాత్రమే అత్యధికంగా 25 పరుగులు చేశాడు. ఫలితంగా ఆ జట్టు స్కోరు వంద కూడా దాటకుండానే అన్ని వికెట్లను కోల్పోయింది. జట్టులో కేవలం ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు. దీంతో కంగారు బౌలర్లు వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ న్యూఢిల్లీ వేదికగా జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్

Telangana: అల్పపీడన ప్రభావం.. తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

జమిలి ఎన్నికలు రాజ్యాంగబద్ధమే అంటున్న న్యాయ నిపుణులు!

భార్యపై అనుమానమా? క్షుద్రపూజలు చేశాడా? భార్యను బండరాళ్లతో కొట్టి హత్య

మాజీ సీజేఐను బంగళా ఖాళీ చేయించాలి.. కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

తర్వాతి కథనం
Show comments