Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్-పాకిస్థాన్ మ్యాచ్.. ఇఫ్తికర్ అహ్మద్‌ దెయ్యాలతో మాట్లాడుతున్నాడా?

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (16:17 IST)
Iftikhar Ahmed
చెన్నై చేపాక్కంలో సోమవారం జరిగిన వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్-పాకిస్థాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ జట్టు భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్ సందర్భంగా రికార్డ్ అయిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
పాకిస్థాన్ బ్యాటర్ ఇఫ్తికర్ అహ్మద్‌‌కు సంబంధించిన వీడియోలో పాకిస్తాన్ స్పీడ్ స్టర్ షహీన్ షా అఫ్రిది, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా ఈ వీడియోలో కనిపించారు. షాదబ్ ఖాన్‌తో షహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్.. మాట్లాడుకుంటూ రావడం ఇందులో రికార్డయింది. వారిద్దరి వెనుకే ఉన్న ఇఫ్తికర్ అహ్మద్ మాత్రం బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా తనతో తాను గట్టి గట్టిగా మాట్లాడుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు.
 
షహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్‌తో అతను మాట్లాడుతున్నట్లు కూడా లేదు. ఇఫ్తికర్ మాత్రం వెనుక రావడం కనిపించింది. ఆ సమయంలో అతను ఎవరినో బెదిరిస్తున్నట్లు అనిపించింది. నిజానికి- గ్రౌండ్‌లో ప్లేయర్లెవరూ ఇయర్ బడ్స్ వాడటానికి అనుమతి లేదు. 
 
ఈ నేపథ్యంలో ఇఫ్తికర్ అహ్మద్ మాత్రం ఇలా ఎవరితోనో మాట్లాడటం కనిపించింది. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఆత్మలు, దెయ్యాలతో మాట్లాడుతున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments