Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివరాజ్ కుమార్ ఘోస్ట్ నుండి హై ఓల్టేజ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మ్యూజిక్

Advertiesment
Ghost, Dr. Shivraj Kumar
, శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (18:31 IST)
Ghost, Dr. Shivraj Kumar
కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్యాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోన్న చిత్రం ఘోస్ట్. దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతుంది.
 
 
ఘోస్ట్ చిత్రం నుండి ' ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మ్యూజిక్ ' లిరిక్ వీడియో విడుదల చేశారు. అర్జున్ జన్య కంపోజ్ చేసిన ఈ హై ఓల్టేజ్ సాంగ్ లో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఉన్న లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. చెన్నై లయోలా కాలేజ్ లో అభిమానుల సమక్షంలో ఈ పాటను విడుదల చేశారు. శివరాజ్ కుమార్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు, మేకింగ్ గ్లింప్సెస్ తో కూడిన లిరిక్ వీడియో చిత్రం మీద అంచనాలు మరింత పెంచేలా ఉంది. 
 
 
ఘోస్ట్ చిత్రానికి సంభందించి ఆకట్టుకునే ఘోస్ట్ ప్రచార చిత్రాల తో పాటు, ఇటీవల బ్లాక్ బస్టర్ జైలర్ లో శివన్న పాత్రకు వచ్చిన ట్రేమెండస్ రెస్పాన్స్ ఘోస్ట్ పై మరింత హైప్ ను తీసుకొచ్చింది. హిందీ కి సంభందించి ఘోస్ట్ చిత్ర హక్కులన్నింటినీ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ జయంతీ లాల్ గడ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం సినిమా మీద ఉన్న క్రేజ్ ను సూచిస్తోంది.
 
 
ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. మోహన్ బి కేరే ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని లావిష్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఘోస్ట్ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకి రానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా బిడ్డ నా కోరికను తీరుస్తున్నాడు :మెగాస్టార్‌ చిరంజీవి