Mohammed Siraj: మహ్మద్ సిరాజ్‌‌తో ప్రేమలో వున్నానా? అబ్బే అవన్నీ గాలి వార్తలు.. మహిరా శర్మ

సెల్వి
మంగళవారం, 4 మార్చి 2025 (18:00 IST)
Mahira Sharma
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై మళ్లీ డేటింగ్ పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్-13లో కనిపించిన నటి మహిరా శర్మతో హైదరాబాద్ క్రికెటర్ ప్రేమలో ఉన్నట్లు ఇటీవల ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, మహిరా ఇప్పుడు ఫిల్మీ జ్ఞాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేసింది.
 
"దీని గురించి చెప్పడానికి ఏమీ లేదు. నేను ఎవరితోనూ ప్రేమలో లేను. అభిమానులు మమ్మల్ని ఎవరితోనైనా కనెక్ట్ చేయగలరు, మేము వారిని ఆపలేము. నా సహనటులతో కూడా, ప్రజలు నా పేరును లింక్ చేశారు. నేను అలాంటి వాటిపై పెద్దగా దృష్టి పెట్టను" అని మహీరా పేర్కొంది.
 
మహీరా వివరణ ఇవ్వడానికి ముందు, ఆమె తల్లి సానియా శర్మ కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ పుకార్లను తోసిపుచ్చింది. తన కూతురు సెలబ్రిటీ కాబట్టి, ప్రజలు ఆమె పేరును ఇతరులతో లింక్ చేస్తారని, అయితే అలాంటి ఊహాగానాలను నమ్మకూడదని ఆమె వివరించారు.
 
మహిరా శర్మ తన కెరీర్‌ను ప్రముఖ టెలివిజన్ షో తారక్ మెహతా కా ఊల్తా చాష్మాతో ప్రారంభించింది. నాగిన్ 3, కుండలి భాగ్య, బెపనా ప్యార్‌లలో పాత్రల ద్వారా గుర్తింపు పొందింది. అయితే, సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్-13లో పాల్గొన్న తర్వాత ఆమె బాగా పాపులర్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

Jubilihills: అమెరికాలో బాత్రూంలు కడిగిన సన్నాసికేం తెలుసు?: నవీన్ యాదవ్ తండ్రి కామెంట్స్

Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: రేవంత్ రెడ్డి ఏ అవకాశాన్ని వదులుకోలేదు..

'కర్మ హిట్స్ బ్యాక్' : జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత కామెంట్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

తర్వాతి కథనం
Show comments