Mohammed Siraj- Zanai Bhosle
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక కాని భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇటీవల, సిరాజ్ ప్రముఖ గాయని ఆశా భోంస్లే మనవరాలు జనై భోంస్లేతో కలిసి ఒక యుగళగీతం పాడారు. వారి ప్రదర్శనకు సంబంధించిన వీడియోను క్రికెటర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో, సిరాజ్ జానైతో కలిసి ఆమె కొత్త మ్యూజిక్ ఆల్బమ్‌లోని కెహందీ హై పాట నుండి కొన్ని లైన్స్ పాడుతూ కనిపించారు. ఈ వీడియో నెట్టింట విస్తృతంగా షేర్ అవుతోంది.
ఈ వీడియోను చూసినవారంతా మహ్మద్ సిరాజ్ - జనాయ్ మధ్య ప్రేమ సంబంధం ఉందనే పుకార్లు పుట్టించారు. అయితే, జనై ఈ ఊహాగానాలను తోసిపుచ్చారు. మా బంధం తోబుట్టువుల బంధం అని స్పష్టం చేశారు.
ఇంకా జనై ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సిరాజ్‌ను "మేరే ప్యారే భాయ్" (నా ప్రియమైన సోదరుడు) అని సంబోధించి, గాసిప్‌లకు ముగింపు పలికింది. సిరాజ్ ఆమెను "బెహ్నా" (సోదరి) అని కూడా పిలిచాడు. వారి తోబుట్టువుల లాంటి సంబంధాన్ని మరింత బలపరిచాడు. ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో చాలా మందిని ఆకర్షించింది. అభిమానులు సిరాజ్ క్రికెట్ నైపుణ్యంతో పాటు అతని గాన ప్రతిభను ప్రశంసిస్తున్నారు.