Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్ గడ్డపై భారత్‌కు షాక్.. రాహుల్‌కు మొండిచేయి... జట్టు ఇదే...

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (09:57 IST)
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అలాగే, కివీస్ పర్యటనలో సూపర్ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ తేరుకోలేని షాకిచ్చింది. కివీస్‌తో త్వరలో జరగబోయే టెస్టు సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో అతడికి మొండిచేయి చూపింది. యువ ఆటగాళ్లు పృథ్వీషా, శుభ్‌మన్ గిల్‌కు చోటు కల్పించిన సెలక్టర్లు.. యువ పేసర్ నవ్‌దీప్ సైనీకి అవకాశం కల్పించారు.
 
అలాగే, ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో గాయపడిన ఇషాంత్‌శర్మకు కూడా జట్టులో చోటు కల్పించినప్పటికీ పూర్తి ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే తుది జట్టులో స్థానం దక్కుతుంది. మౌంట్ మాంగనుయిలో జరిగిన చివరి టీ20లో గాయపడి వన్డే, టెస్టు సిరీస్‌ నుంచి తప్పుకున్న రోహిత్‌శర్మ స్థానంలో మయాంక్ అగర్వాల్‌కు స్థానం కల్పించారు. కాగా, కివీస్‌త జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌ల కోసం బీసీసీ జాతీయ సెలెక్టర్లు సోమవారం జట్టును ప్రకటించారు. ఆ వివరాలను పరిశీలిస్తే,
 
భారత క్రికెట్ జట్టు... 
విరాట్ కోహ్లీ (కెప్టెన్) మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, శుభ్‌మన్ గిల్, పుజారా, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), హనుమ విహారి, వృద్ధిమాన్ సాహు (వికెట్ కీపర్), రిషభ్‌పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, నవ్‌దీప్ సైనీ, ఇషాంత్‌శర్మ (ఫిట్నెస్ నిరూపించుకోవాలి).

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

నాలా వద్ద మహిళ మృతదేహం.. వరదల్లో కొట్టుకుపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

తర్వాతి కథనం
Show comments