Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుత్తా జ్వాలా ఇంట్లో పెళ్లి సెలెబ్రేషన్స్ షురూ..

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (09:12 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఇంట పెళ్లి సంబురాలు మొదలయ్యాయి. కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌ను ఈమె పెళ్లాడనుంది. వీరి వివాహం ఈ నెల 22వ తేదీన జరుగనుంది. 
 
అయితే, ఈ పెళ్లికి కేవలం రెండు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో సంబ‌రాలు మొద‌లు పెట్టేశారు. గుత్తా జ్వాలా స్నేహితులు ఇంటికి వ‌చ్చి ఆమెతో కేక్ క‌ట్ చేయించి సెల‌బ్రేష‌న్స్ షురూ చేశారు. 
 
ఫ్రెండ్స్ అంద‌రితో క‌లిసి గుత్తా జ్వాల చేసిన సంద‌డి ఓ రేంజ్‌లో ఉండ‌గా, వాటికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చల్ చేస్తున్నాయి.  ఇదిలావుంటే, గుత్తా జ్వాల‌, విష్ణు విశాల్ ఇద్ద‌రికి ఇది రెండో వివాహ‌మే. 
 
విష్ణు విశాల్ 2010లో ర‌జ‌నీ న‌ట‌రాజ‌న్‌ను వివాహం చేసుకోగా, 2018లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఇక గుత్తా జ్వాల 2005లో బ్యాడ్మింట‌న్ క్రీడాక‌రుడు చేత‌న్ ఆనంద్‌ను వివాహం చేసుకోగా, మ‌న‌స్ప‌ర్థ‌ల వ‌ల‌న 2011లో ఇరువురు విడిపోయారు. 
 
ఆ తర్వాత గుత్తా జ్వాలా, విష్ణు విశాల్‌లు మనస్సులు కలవడంతో గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారు. వీరిద్దరూ ఇటీవలే మాల్దీవులకు విహారయాత్రకు కూడా వెళ్లివచ్చారు. కాగా, విష్ణు విశాల్ తెలుగులో వచ్చిన "అరణ్య" చిత్రంలో నటించారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాఫిక్‌తో విసుగు చెంది బైకును మోసుకుంటూ వెళ్ళిన యువకుడు..

Kavitha and Sharmila: ఏపీలో షర్మిల.. తెలంగాణలో కవిత..? ఏం జరుగబోతోంది?

పీకలదాకా మద్యం సేవించి వచ్చి తరగతి గదిలో నిద్రపోయిన తాగుబోతు టీచర్!

Kavitha: తెలుగు రాజకీయాల్లో విడిపోయిన మరో కుటుంబం.. టీడీపీలోకి కవిత ఎంట్రీ ఇస్తారా?

నోబెల్ పురస్కారానికి సిఫార్సు చేయలేదనే భారత్‌పై ట్రంప్ అక్కసు.. అందుకే సుంకాల పోటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2: బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్.. ఎవరు?

Rashmika : విజయ్ దేవరకండ, రష్మిక పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

Nag Ashwin: కళ్యాణి ప్రియదర్శన్ నేనూ ఒకేలా వుంటాం, ఆలోచిస్తాము :దుల్కర్ సల్మాన్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments