Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఓడింది.. భారత్ సెమీస్ పోరు ఎవరితోనో ఖాయమైంది..!

Webdunia
శనివారం, 11 నవంబరు 2023 (23:07 IST)
ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ ఓడింది. ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లో 43.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 338 పరుగుల విజయలక్ష్యాన్ని పాకిస్థాన్ 6.4 ఓవర్లలో ఛేదిస్తే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో పాక్ సెమీస్ చేరుతుంది. 
 
కానీ, పాక్ ఈ విషయంలో విఫలం కావడంతో మ్యాచ్ పూర్తి కాకముందే ఆ జట్టు టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. దాంతో న్యూజిలాండ్ జట్టుకు సెమీస్ బెర్తు ఖరారైంది. 
 
టీమిండియా (16), దక్షిణాఫ్రికా (14), ఆస్ట్రేలియా (14) ఇప్పటికే సెమీస్ చేరడం తెలిసిందే. ఇప్పుడు పాక్ నిష్క్రమణ నేపథ్యంలో కివీస్ నాలుగో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించింది. న్యూజిలాండ్ 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్ల సాధించింది. 
 
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాతో, నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్లో తలపడనుంది. భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్‌లో మొదటి సెమీఫైనల్ ఈ నెల 15న ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరగనుంది. 
 
రెండో సెమీఫైనల్ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ఈ నెల 16న జరగనుంది. ఫైనల్ మ్యాచ్ ఈ నెల 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

తర్వాతి కథనం
Show comments