Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తపాలా శాఖలో 1899 ఉద్యోగాలు... 10 నుంచి దరఖాస్తుల ఆహ్వానం

Advertiesment
postal department
, గురువారం, 9 నవంబరు 2023 (18:14 IST)
భారత తపాలా శాఖలో 1899 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను తాజాగా విడుదలైంది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్ళలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేస్తారు. పలు క్రీడాంశాల్లో ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన అభ్యర్థుల నుంచి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో https://dopsportsrecruitment.cept.gov.in/#లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
 
మొత్తం ఉద్యోగాల్లో పోస్టల్ అసిస్టెంట్ పోస్టులు 598 ఉండగా.. సార్టింగ్ అసిస్టెంట్ 143, పోస్ట్ మ్యాన్ 585, మెయిల్ గార్డ్ 3, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 570 చొప్పున ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
 
నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 10 నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తుల్ని ఎడిట్ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తారు.
 
దరఖాస్తు రుసుం జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.100 కాగా, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ ఈడబ్ల్యూఎస్/మహిళలు ఎలాంటి దరఖాస్తు రుసుం చెల్లించనవసరంలేదు.
 
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఏపీలో 27 పోస్టల్ అసిస్టెంట్, 2 సార్టింగ్ అసిస్టెంట్, 15 పోస్ట్ మ్యాన్, 17 ఎంటీఎస్ పోస్టులు భర్తీ చేయనుండగా.. తెలంగాణలో 16 పోస్టల్ అసిస్టెంట్, 5 సార్టింగ్ అసిస్టెంట్, 20 పోస్టుమ్యాన్, 2 మెయిల్గార్డు, 16 ఎంటీఎస్ ఉద్యోగాలు ఉన్నాయి.
 
వేతనం ఇలా..: పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ (లెవెల్ 4) ఉద్యోగాలకు వేతన శ్రేణి రూ.25,500 - రూ.81,100గా నిర్ణయించారు. అలాగే, పోస్టుమ్యాన్, మెయిల్ గార్డు (లెవెల్ 3) రూ.21,700, - రూ.69,100 చొప్పున, మల్టీటాస్కింగ్ సిబ్బంది (లెవెల్ 1) రూ.18,000 నుంచి 59,900ల చొప్పున వేతనం చెల్లిస్తారు. 
 
వయో పరిమితి : పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టుమ్యాన్, మెయిల్ గార్డు పోస్టులకు వయో పరిమితి 18 నుంచి 27ఏళ్లుగా నిర్ణయించగా.. ఎంటీఎస్ ఉద్యోగాలకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు. ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. 
 
విద్యార్హతలు : తపాలాశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొన్న క్రీడాంశాల్లో అర్హతతో పాటు పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. అలాగే, పోస్టుమ్యాన్ / మెయిల్ ఆర్డర్ పోస్టులకు ఇంటర్ విద్యార్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : బరిలో ఎలక్షన్ కింగ్ పద్మరాజన్