ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన భారతీయ స్టేట్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. తాజాగా 94 రిసాల్వర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎవరైనా ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
ఎస్బీఐ రిక్రూట్మెంట్ 2023 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఈ నెల 21వ తేదీలోపు తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల కోసం రిటైర్డ్ బ్యాంకు అధికారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులలలో ఉద్యోగం పొందడానికి ఆసక్తివున్నవారు కొన్నివిషయాలు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఎస్బీఐ అధికారి అయితే, నిర్దిష్ట విద్యార్హత అక్కర్లేదు. తగిన పని అనుభవం, సిస్టమ్‌లు, ప్రక్రియ లోతైన పరిజ్ఞానంతో పాటు వృత్తిపరమైన నైపుణ్యం ఉన్న మాజీ అధికారులకు ప్రాధాన్య ఇస్తారు. ఎంపిక ప్రక్రియలో ముఖాముఖి రౌండ్ కూడా ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని అవసరమైనపత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే వారి దరఖాస్తు అభ్యర్థిత్వ షార్ట్ లిస్ట్ లేదా అభ్యర్థిత్వం కోసం పరిగణనలోకి తీసుకోరు.