Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతదేశంలో మధుమేహంతో బాధపడుతున్న వారి కోసం మొట్ట మొదటి బయోసిమిలర్ ఇన్సులిన్ అస్పార్ట్‌

Diabetes
, శుక్రవారం, 10 నవంబరు 2023 (22:07 IST)
భారతదేశపు మొట్టమొదటి బయోసిమిలర్ ఇన్సులిన్ అస్పార్ట్, ఇన్సూక్విక్‌ని విడుదల చేసినట్లు USV ప్రైవేట్ లిమిటెడ్, బయోజెనోమిక్స్ ప్రకటించాయి. మధుమేహం ఉన్నవారి చికిత్స అవకాశాలను ఇది మెరుగుపరుస్తుంది. భారతదేశంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యగా మధుమేహం నిలుస్తుంది. దేశపు జనాభా లో 11.4% అంటే 101 మిలియన్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది కాకుండా, అదనంగా 136 మిలియన్ల మంది ప్రీ-డయాబెటిక్ సమస్యతో ఉండటంతో పాటుగా తక్కువ సమయంలో డయాబెటిస్‌గా మారే అవకాశం కలిగి ఉన్నారు.
 
ఇన్సూక్విక్  అనేది "మేక్ ఇన్ ఇండియా" ఉత్పత్తి. 100% స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి మరియు తయారు చేయబడింది. ప్రపంచ నాణ్యతా ప్రమాణాల కోసం అత్యంత క్లిష్టమైన క్లినికల్ పరీక్షలను ఎదుర్కొంది. ఇది అన్ని మెట్రోలు మరియు టైర్ I/II నగరాల్లో అందుబాటులో ఉంది.
 
USV ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రశాంత్ తివారీ మాట్లాడుతూ, "మధుమేహం ఉన్నవారి జీవిత నాణ్యతను మెరుగుపరచడానికి మేము కట్టుబడి ఉన్నాము. మా దృఢ నిశ్చయాన్ని బలోపేతం చేయడానికి, ఓరల్ యాంటీ డయాబెటిస్ విభాగంలో అగ్రగామిగా, ఇంజెక్షన్ల విభాగంలోకి మా ప్రవేశం వ్యూహాత్మకమైనది. మా మార్కెట్ ఉనికిని బలోపేతం చేయటంతో పాటుగా మధుమేహం మార్కెట్‌లో అగ్రగామిగా ఉండాలనే మా ఆకాంక్షను చేరుకునే దిశగా అడుగులు వేయడానికి తోడ్పడుతుంది. మధుమేహంతో బాధపడుతున్న మన  ప్రజలకు అంతర్జాతీయ-నాణ్యత కలిగిన ఇన్సులిన్ అస్పార్ట్‌ను అందించడానికి బయోజెనోమిక్స్‌తో మేము భాగస్వామ్యం చేసుకున్నాము" అని అన్నారు.
 
బయోజెనోమిక్స్ సహ వ్యవస్థాపకుడు మరియు ప్రెసిడెంట్ డాక్టర్ సంజయ్ సోనార్ మాట్లాడుతూ, “వేగంగా పనిచేసే ఇన్సులిన్ విభాగంలో మొదటి బయోసిమిలర్ ఇన్సులిన్ అస్పార్ట్, ఇది పదేళ్లకు పైగా R&D ప్రయత్నాల ఫలితంగా ఉద్భవించింది" అని అన్నారు. బయోజెనోమిక్స్ సహ-వ్యవస్థాపకురాలు మరియు డైరెక్టర్  డాక్టర్ అర్చన కృష్ణన్ మాట్లాడుతూ, ఇది భారతదేశంలో 100% స్వదేశీ సాంకేతికతతో తయారుచేయబడినది. నిర్మాణ ఆకృతిని నిర్ధారించటానికి వేలిముద్ర లాంటి సిమిలారిటీ ని వినియోగించారు. సమర్థత మరియు భద్రతను నిర్ధారించటానికి బలమైన క్లినికల్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించారని పేర్కొన్నారు.
 
క్యాట్రిడ్జ్‌లు, వైల్స్ మరియు ప్రీఫిల్డ్ డిస్పోజబుల్ పెన్నులలో ఇన్సూక్విక్ అందుబాటులో ఉంటుంది. మధుమేహం ఉన్న వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా ఫ్లెక్సిబిలిటీని ఇది అందిస్తుంది. పునర్వినియోగపరచదగిన పెన్నులు సమకాలీనమైనవి మరియు డిజైన్‌లో తేలికైనవి. ఖచ్చితమైన ఇంక్రిమెంటల్ సెట్టింగ్‌ల కోసం స్పష్టమైన స్కేల్ మరియు వినగల క్లిక్‌లను కలిగి ఉంటాయి. ఇన్సులిన్ మార్కెట్‌లోకి USV ప్రవేశానికి ఇన్సులిన్ అస్పార్ట్ ప్రారంభం మాత్రమే. డయాబెటీస్ ఉన్న వ్యక్తులకు సమగ్ర పరిష్కారాలను అందించడానికి బలమైన R&Dతో రాబోయే సంవత్సరాల్లో కంపెనీ విస్తరణ కొనసాగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీతాఫలం హెల్త్ సీక్రెట్స్ ఇవే