Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ - కెప్టెన్‌గా రిషబ్ పంత్

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (07:18 IST)
భారత, దక్షిణాఫ్రికా జట్లు మధ్య గురువారం నుంచి ట్వంటీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నెట్ ప్రాక్టీస్‌లో కుల్దీప్ యాదవ్ జట్టుకు దూరంగా కాగా, గజ్జల్లో గాయంతో కేఎల్ రాహుల్ బాధపడుతున్నారు. దీంతో వీరిద్దరూ జట్టుకు దూరమయ్యారు. 
 
ఫలితంగా భారత జట్టు పగ్గాలను కీపర్ రిషబ్ బంత్‌కు అప్పగించారు. అలాగే, వైస్ కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు ఇచ్చినట్టు బీసీసీఐ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. కేఎల్ రాహుల్‌కు కుడిపైపు గజ్జల్లో గాయమైందని, కుల్దీప్ యాదవ్‌కు నెట్‌లో ప్రాక్టీస్ చేస్తుంటే చేతికి బంతి తగిలి గాయమైందని బీసీసీఐ తెలిపింది. 
 
భారత్ టీ20 జట్టు ఇదే.. 
రిషబ్ పంత్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హూడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, ఆర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

జగన్ కేసుల్లో కీలక పరిణామం : కింది కోర్టుల్లో పిటిషన్ల వివరాలు కోరిన సుప్రీం

బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

తర్వాతి కథనం
Show comments