చేతులెత్తేసిన మహిళా క్రికెటర్లు... ఇంగ్లండ్ చేతిలో ఓటమి

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (11:08 IST)
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సెమీఫైనల్లో భారత్ ఓటమిపాలైంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. గతేడాది వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్‌ సేన నిరాశకు నిరాశతప్పలేదు. ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ ఇంగ్లండ్‌కు గట్టి పోటీ ఇవ్వలేక పోయింది.
 
ముందుగా ఇంగ్లండ్ జట్టు బౌలర్లు భారత్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయగా, అనంతరం బ్యాట్స్‌వుమెన్‌ జోన్స్‌(51, 42బంతుల్లో 3×4, 1×6), నటైలి (54, 43బంతుల్లో 5×4) రాణించడంతో ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. 
 
అంతకుముందు బ్యాటింగ్‌కు భారత్‌ 19.3ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధాన(34, 23బంతుల్లో 5×4, 1×6), రోడ్రిగ్స్‌(26, 26 బంతుల్లో 3×4) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత్‌ చివర్లో 23 పరుగులకే ఎనిమిది వికెట్లు చేజార్చుకుంది.
 
ఆ తర్వాత 113 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలో భారత్‌ నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఓపెనర్లు బిమంట్ - వ్యాట్ ఐదు ఓవర్లకే ఔట్‌ అయ్యారు. ఆ సమయంలో జోన్స్‌(51, 42బంతుల్లో 3×4, 1×6)తో జత కలిసిన నటైలి(54, 43బంతుల్లో 5×4) మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చింది. 
 
ఈ జోడీ వీలు చిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా పడుతూ లక్ష్యాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో 17.1 ఓవర్లలోనే ఇంగ్లాండ్‌ లక్ష్యాన్ని ఛేదించింది. 25న జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ జట్టు తలపడనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీకాకుళం కాశిబుగ్గ వెంకన్న ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిది మంది మృతి (video)

బాసరలో తల లేని నగ్నంగా ఉన్న మహిళ మృతదేహం.. స్థానికులు షాక్

Telangana Speaker: ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం- సుప్రీంకోర్టు గడువు ముగింపు

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై హోంమంత్రి అనిత పరిశీలన

AP Liquor Scam: రూ.3,200 కోట్ల ఏపీ మద్యం కుంభకోణం- 48 మందిపై కేసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

తర్వాతి కథనం
Show comments