అండమాన్ నికోబార్ దీవుల్లోని ఓ దీవికి వెళ్లిన ఓ అమెరికన్ జాతీయుడిని అక్కడ నివసించే సెంటీనల్ అటవీకులు బాణాలతో చంపి శవాన్ని భూమిలో సగభాగం పూడ్చిపెట్టినట్లు స్థానిక మత్స్యకారులు గమనించారు. విషయం తెలుసుకున్న స్థానికులు అమెరికాలోని మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
ఇండియన్ ఎంబసీని వివరాలు కోరుతూ.. అమెరికన్ ఎంబసీ అధికారులు సంప్రదించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురు మత్స్యకారులపై కేసు నమోదు చేశారు.
సెంటినల్ దీవిలోని అటవిక జాతి గురించి..
ఈ అటవీకులు వేట కొనసాగిస్తూ.. తమ జీవితాన్ని కొనసాగిస్తారు. గతంలో కూడా ఇలా బయటవారిని చూసి భయంతో చంపేసిన ఘటనలు వున్నాయని స్థానిక పత్రికలు చెప్తున్నాయి. అక్కడ ఆటవికజాతి అంతరించిపోతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఆ దీవుల సందర్శనను రద్దు చేసింది. అండమాన్ షీఖా అనే స్థానిక పత్రిక ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆ దీవిలో జనాభా 40మందిగానే అంచనా వేశారు.