Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ అమ్మాయిలు పెళ్లి చేసుకోరు.. నచ్చితే సహజీవనం.. పిల్లలు కూడా...

మనదేశం భిన్న సంస్కృతులు, ఆచారాలకు పుట్టినిల్లు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన కట్టుబాట్లూ, సంప్రదాయాలు ఉంటాయి. అలాంటి భిన్నమైన సంప్రదాయం ఉన్న తెగ ఒకటి రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఈ తెగకు చెందిన అమ్మాయిలు

Advertiesment
ఆ అమ్మాయిలు పెళ్లి చేసుకోరు.. నచ్చితే సహజీవనం.. పిల్లలు కూడా...
, మంగళవారం, 7 ఆగస్టు 2018 (09:52 IST)
మనదేశం భిన్న సంస్కృతులు, ఆచారాలకు పుట్టినిల్లు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన కట్టుబాట్లూ, సంప్రదాయాలు ఉంటాయి. అలాంటి భిన్నమైన సంప్రదాయం ఉన్న తెగ ఒకటి రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఈ తెగకు చెందిన అమ్మాయిలు వివాహం చేసుకోరు. కానీ నచ్చితే సహజీవనం చేస్తారు. పిల్లలు కూడా పుట్టించుకుంటారు. ఆ తర్వాతే పెళ్లి చేసుకుందామంటారు.
 
నిజానికి ఇటీవలికాలంలో బాగా వినిపిస్తున్న మాట సహజీవనం. అనేక మంది యువతీయువకులు ఇష్టపడుతున్న జీవితం కూడా ఇదే. పెళ్లి చేసుకోకుండానే ఒకే ఇంట్లో కలిసివుంటారు. పడక సుఖం పంచుకుంటారు. అప్పటికి నచ్చితే పెళ్లి చేసుకుంటారు. లేదంటే ఎలాంటి గొడవలు లేకుండా విడిపోతారు. అచ్చం ఇలాంటి సంప్రదాయమే గరాసియా తెగ అమ్మాయిలు, అబ్బాయిలు అనుసరిస్తున్నారు. 
 
అయితే, సహజీవనం చేయాలా వద్దా అనే విషయంలో నిర్ణయాధికారం అమ్మాయిలదే. పెళ్లివయసు వచ్చాక అమ్మాయికి ఒకబ్బాయి నచ్చారంటే.. అతని అనుమతితో సహజీవనం చేస్తారు. ఏళ్ల తరబడి సహజీవనం చేసి.. పిల్లలు పుట్టి పెద్దాయ్యాక చాలా మంది పెళ్లి చేసుకుంటారు. ముఖ్యంగా ఆర్థికంగా నిలదొక్కుకున్నామని అనిపిస్తేనే పెళ్లి చేసుకోవడం అనాదిగా వస్తోంది. అందుకే ఈ తెగలో గృహహింస, వరకట్నాలు, అత్యాచారాలు ఉండవు. 
 
ఒకసారి సహజీవనం మొదలుపెట్టిన తర్వాత ఆ అబ్బాయి జీవితాంతం ఆమెతోనే కలిసి ఉండాలి. మరొకరితో సహజీవనం చేయకూడదు. పైగా ప్రతినెల ఆ మహిళకు డబ్బులు ఇవ్వాలి. పెళ్లి ఖర్చులు అబ్బాయి తరపు వారే పూర్తిగా భరించాలి. ఈ తెగలో ఎక్కువ శాతం 60, 70 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పడువు వృత్తి మానేశాం.. ఇక మా వద్దకు రావొద్దు...