Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పడువు వృత్తి మానేశాం.. ఇక మా వద్దకు రావొద్దు...

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లాలో భారీ సెక్స్ రాకెట్‌ను బయటపడింది. ముఖ్యంగా బాలికలతో వ్యభిచారం చేయిస్తూ అనేక మంది నిర్వాహకులు పట్టుబడ్డారు. ఇలా పడుపు వృత్తిలో నిమగ్నమైవున్న బాలికల్లో 15 మంద

Advertiesment
Prostitute
, మంగళవారం, 7 ఆగస్టు 2018 (09:09 IST)
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లాలో భారీ సెక్స్ రాకెట్‌ను బయటపడింది. ముఖ్యంగా బాలికలతో వ్యభిచారం చేయిస్తూ అనేక మంది నిర్వాహకులు పట్టుబడ్డారు. ఇలా పడుపు వృత్తిలో నిమగ్నమైవున్న బాలికల్లో 15 మందికి పోలీసులు విముక్తి కల్పించారు. అలాగే, పడుపు వృత్తిలో కొనసాగుతూ వచ్చిన పలువురు వ్యభిచారిణులు కూడా ఈ వృత్తిని వదిలిపెట్టేందుకు ముందుకు వచ్చారు. ఇలాంటి వారిని పోలీసులు సన్మానించారు.
 
అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా యాదగిరిగుట్టను అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతోపాటే కొండ దిగువన అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని ఆదేశించింది. యాదాద్రిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసిన అధికారులు.. అనేకమంది పడుపు వృత్తిలో ఉన్నట్టు వెల్లడించారు. 
 
అగౌరవమైన పడుపు వృత్తిని మానుకోవడానికి ఎలాంటి ప్రత్యామ్నాయం కావాలని పోలీసులు అడిగారు. తమకు ఇళ్లు, ఉపాధి, చిరు వ్యాపారాలకు ఆర్థికసాయం, సబ్సిడీపై రుణాలు, పిల్లలకు ఉచిత చదువులు, ఉపకార వేతనాలు, విద్యావంతులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. బీసీ-డీ గ్రూపులో ఉన్న తమను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని విన్నవించారు. ఆ ప్రకారంగా ఆ వృత్తిని వదిలిపెట్టిన పలువురు వ్యభిచారిణిలకు పోలీసులు సన్మానించారు. ప్రభుత్వ పరంగా వివిధ రకాల సహాయాలు అందేలా చర్యలు తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పని చేయని అవయవాలు... అత్యంత విషమంగా కరుణానిధి ఆరోగ్యం