Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రో వచ్చేస్తోంది.. ధర రూ.15వేల నుంచి రూ.20వేల లోపు?

జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రో వచ్చేస్తోంది.. ధర రూ.15వేల నుంచి రూ.20వేల లోపు?
, గురువారం, 22 నవంబరు 2018 (11:12 IST)
జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రో భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఫోన్‌లో డుయెల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ను కలిగివుంటుంది. 19:9 ఇంచ్‌ల డిస్ ‌ప్లే 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, పీ2ఐ వాటర్ రిపెలెంట్ నానో టెక్నాలజీ, 6జీబీల సామర్థ్యం కలిగిన రామ్,64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీని ఈ ఫోన్ కలిగి వుంటుంది. అంతేగాకుండా.. ఎంఐయూఐ 10 అవుట్ ఆఫ్ బాక్స్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 
 
జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రో అనే ఈ ఫోన్ ఫ్లిఫ్‌కార్ట్, ఎంఐడాట్‌కామ్‌లో అందుబాటులో వుంటుందని రెడ్‌మీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రో లాంచ్ లైవ్ స్ట్రీమింగ్‌ను జియోమీ వెబ్‌సైట్‌లో చూడొచ్చునని సంస్థ వెల్లడించింది. 
 
ఇకపోతే.. జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రోను తొలుత సెప్టెంబరులో థాయ్‌లాండ్‌లో ఆవిష్కరించారు. ఆ ఫోన్‌ 4జీబీ రామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్‌ను కలిగివున్నది. దీని ధర రూ.6,990 నుంచి రూ.15,300లుగా వున్నది. ప్రస్తుతం భారత్‌లో విడుదలయ్యే జియోమీ రెడ్ మీ నోట్ 6 ప్రోకూడా రూ.15వేల నుంచి రూ.20వేల లోపు వుండవచ్చునని సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిడ్డను గుండెలపై కట్టుకుని సరస్సులో దూకిన తల్లి