అడిలైడ్ టెస్టు.. భారత్‌పై ఆసీస్ సునాయాస విజయం.. కోహ్లీ సేన ఖాతాలో చెత్త రికార్డ్

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (14:23 IST)
India vs Australia
అడిలైడ్ టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా సునాయాస విజయాన్ని నమోదు చేసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యం సాధించింది. 90 రన్స్ టార్గెట్‌తో ఇవాళ రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన కంగారూలు.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకున్నారు. 21 ఓవర్లలో 93 రన్స్ చేశారు. ఓపెనర్ జో బర్న్స్ హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. 
 
అంతకముందు మూడవ రోజు తొలి సెషన్‌లో ఆసీస్ బౌలర్లు తడాఖా చూపించారు. శరవేగంగా బంతులు వేస్తూ.. భారత బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా తన రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 36 రన్స్‌కే ఆలౌటైంది. 
 
హేజల్‌వుడ్ 5 వికెట్లు తీయగా, కమ్మిన్స్ నాలుగు వికెట్లు తీశాడు. షమీ రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. స్వల్ప లక్ష్యంతో చేజింగ్ దిగిన ఆస్ట్రేలియా అతి సునాయాసంగా టార్గెట్‌ను అందుకున్నది. 8 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నది. ఆసీస్ రెండవ ఇన్నింగ్స్‌లో మాథ్యూ వేడ్ 33, వేడ్ 51 రన్స్ చేశారు.
 
ఇదిలా ఉంటే.. కోహ్లీ సేన ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 36 పరుగులు మాత్రమే చేసింది. భారత క్రికెట్ జట్టు టెస్ట్ చరిత్రలోనే ఇది అత్యల్పం.
 
గతంలో అత్యల్ప సోర్కు నమోదు చేసిన ఇన్నింగ్స్ వివరాలు..
- 1974 లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో టీమిండియా 42 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
- 1947లో ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌లో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగులు చేసింది.
- 1952లో మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగులు చేసింది.
 
- 1996లో దక్షిణాఫ్రికాతో జరిగిన డర్బన్ మ్యాచ్‌లో 66 పరుగులు,
- 1948లో ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగులు చేసింది. బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. భారత ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 36 పరుగులకే రెండో ఇన్నింగ్స్ ముగిసిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

తర్వాతి కథనం
Show comments