Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిడ్నీ వన్డే : భారత బౌలింగును చీల్చి చెండాడిన కంగారులు : భారీ టార్గెట్

సిడ్నీ వన్డే : భారత బౌలింగును చీల్చి చెండాడిన కంగారులు : భారీ టార్గెట్
, ఆదివారం, 29 నవంబరు 2020 (13:33 IST)
సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో కంగారులు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. ముఖ్యంగా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వరుసగా రెండో సెంచరీ బాదాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి ప్రపంచస్థాయి పేసర్లు కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన వేళ సిడ్నీ మైదానం మరోసారి పరుగుల జడివానలో తడిసిముద్దయింది. దీంతో భారత్ ముంగిట 390 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 
 
ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా వార్నర్, ఫించ్‌లు ఓపెనర్లుగా దిగి.. తొలి వికెట్‌కు 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వార్నర్ 83 పరుగుల వద్ద, ఫించ్ 60 రన్స్ వద్ద ఔట్ అయ్యారు. వీరిలో ఫించ్ 69 బంతుల్లో 60 పరుగులు చేసి, ఒక సిక్సు, ఆరు ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసిన ఔటయ్యాడు. అనంతరం కొద్ది సేపటికే డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు. అతడు 77 బంతుల్లో 3 సిక్సులు, 7 ఫోర్లతో 83 పరుగులు చేశాడు.
 
ఆ తర్వాత మూడో ఆర్డరులో వచ్చిన స్మిత్ మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. టీమిండియా బౌలింగును చీల్చిచెండాడుతూ 104 పరుగుల వద్ద ఔటయ్యాడు. స్మిత్ కేవలం 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులతో 104 పరుగులు నమోదు చేశాడు. స్మిత్‌తో విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన మార్నస్ లబుషేన్ 61 బంతుల్లో 70 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు.
 
ఇక, మ్యాచ్ ఆఖరులో విధ్వంసం అంతా గ్లెన్ మ్యాక్స్ వెల్ దే. చిచ్చరపిడుగులా చెలరేగిన మ్యాక్సీ 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో చకచకా 63 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ ఏడుగురితో బౌలింగ్ చేయించినా ఆసీస్ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్టపడలేదు. బ్యాటింగుకు అనుకూలిస్తున్న సిడ్నీ పిచ్‌పై భారత బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిడ్నీ వన్డే : ఆసీస్ ఆటగాళ్ల వీరకుమ్ముడు.. భారత బౌలర్ల బేజారు