Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్ట్రేలియాకు షాక్.. డేవిడ్ వార్నర్ గాయంతో అవుట్.. తొడ కండరాల్లో నొప్పితో..?

ఆస్ట్రేలియాకు షాక్.. డేవిడ్ వార్నర్ గాయంతో అవుట్.. తొడ కండరాల్లో నొప్పితో..?
, సోమవారం, 30 నవంబరు 2020 (12:23 IST)
ఆస్ట్రేలియాకు షాక్ తప్పేలాలేదు. వరుసగా రెండు వన్డేల్లో టీమిండియాపై అర్థశతకాలతో రాణించిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా వన్డేలకు దూరమయ్యాడు. ఆదివారం రెండో వన్డే సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తూ అతడు గాయపడిన సంగతి తెలిసిందే. 
 
తొడ కండరాల్లో నొప్పితో మైదానంలోనే విలవిల్లాడడంతో వెంటనే స్పందించిన ఆస్ట్రేలియా జట్టు వైద్య బృందం వార్నర్‌ను బయటకు తీసుకెళ్లింది. అనంతరం వైద్య పరీక్షలు చేయగా తీవ్రగాయమైనట్లు తేలింది. దీంతో అతడు మూడో వన్డేతో పాటు తర్వాత ఆడాల్సిన మూడు టీ20ల సిరీస్‌కు అందుబాటులో ఉండడని కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ పేర్కొన్నట్లు ఐసీసీ ట్వీట్‌ చేసింది.
 
వార్నర్‌ స్థానాన్ని జాన్‌ మాథ్యూ షార్ట్‌ భర్తీ చేస్తాడని లాంగర్‌ పేర్కొన్నాడు. అలాగే తమ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ గెలుపొందడంతో.. టెస్టు సిరీస్‌కు ముందు ప్రధాన పేసర్‌ పాట్‌ కమిన్స్‌కు కూడా విశ్రాంతి ఇవ్వాలనుకున్నట్లు ఆసీస్‌ కోచ్‌ తెలిపాడు. అయితే, అతడికి ప్రత్యామ్నాయ ఆటగాడిని మాత్రం వెల్లడించలేదు. వార్నర్‌, కమిన్స్‌ తమకు కీలక ఆటగాళ్లని, రాబోయే టెస్టు సిరీస్‌లో వాళ్లు రాణించాలంటే తగినంత విశ్రాంతి అవసరమని చెప్పాడు.
 
డిసెంబర్‌ 17 నుంచి టీమ్‌ఇండియాతో ప్రారంభమయ్యే 4 టెస్టుల సిరీస్‌ తమకెంతో ముఖ్యమని అన్నాడు. ఆ సిరీస్‌లో సత్తా చాటాలని అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా తొలి రెండు వన్డేల్లో విఫలమవగా మంగళవారం మూడో వన్డేలో తలపడనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిడ్నీ వన్డే : మళ్లీ ఓడిన టీమిండియా - వన్డే సిరీస్ ఆస్ట్రేలియా వశం