Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు.. పాత కాపులకు పిలుపు

సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది. వచ్చేనెల 16 నుంచి ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. తొలి టెస్ట్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్‌

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (06:58 IST)
సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది. వచ్చేనెల 16 నుంచి ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. తొలి టెస్ట్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ వేదికకానుంది. 
 
ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే మొదటి రెండు టెస్టులకు 16 మంది సభ్యులలతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. గత కొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్న రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నారు. 
 
ఈ యేడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ సమయంలో మురళీ విజయ్‌కు గాయమైంది. శస్త్రచికిత్స కోసం యూకే వెళ్లిన విజయ్‌ ఐపీఎల్‌తో పాటు ఆ తర్వాత శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. సుదీర్ఘ విరామం తర్వాత మురళీ విజయ్‌ తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అలాగే, ఈ యేడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఆడిన ఇషాంత్‌ శర్మకు కూడా స్థానం కల్పించారు. 
 
జట్టు వివరాలు : విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌, శిఖర్‌ ధావన్‌, ఛటేశ్వర పుజారా, రహానె(వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, మహమ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

మా సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోండి.. బీఆర్ నాయుడికి హరీశ్ వినతి (Video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా?

అమెరికా నుంచి భారతీయులను ప్రత్యేక విమానాలలో ఎందుకు తిప్పి పంపుతున్నారు, ట్రంప్ వచ్చాక ఏం జరగనుంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్ ఇకలేరు

ఉక్కు సత్యాగ్రహం ఇన్ స్పైరింగ్ గా ఉంది : సీబీఐ మాజీ వీవీ లక్ష్మి నారాయణ

తర్వాతి కథనం
Show comments