Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విరాట్ కోహ్లీకి నో రెస్ట్.. కివీస్‌తో ట్వంటీ-20 సిరీస్ ఆడాల్సిందే.. బీసీసీఐ సెలక్టర్లు

కివీస్‌తో తొలి వన్డేలో పరాజయం పాలైన టీమిండియా.. ఇక జరుగనున్న మ్యాచ్‌ల్లో ఆచితూచి వ్యవహరించాల్సి వుంది. అయితే తొలి వన్డేలో శతకం సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడ

Advertiesment
విరాట్ కోహ్లీకి నో రెస్ట్.. కివీస్‌తో ట్వంటీ-20 సిరీస్ ఆడాల్సిందే.. బీసీసీఐ సెలక్టర్లు
, సోమవారం, 23 అక్టోబరు 2017 (14:13 IST)
కివీస్‌తో తొలి వన్డేలో పరాజయం పాలైన టీమిండియా.. ఇక జరుగనున్న మ్యాచ్‌ల్లో ఆచితూచి వ్యవహరించాల్సి వుంది. అయితే తొలి వన్డేలో శతకం సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడు. విరామం లేకుండా క్రికెట్ సిరీస్‌లు ఆడిన కోహ్లీ అలసిపోయాడని, ఈ నేపథ్యంలో కివీస్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లీ దూరం కానున్నట్లు వార్తలొచ్చాయి. 
 
అయితే  విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించి, రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తారనుకున్నా... సెలక్టర్లు రొటేషన్‌కు మొగ్గు చూపలేదు. కివీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇందులో కోహ్లీకి స్థానం కల్పించింది. ఇక నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌కు హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌ ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో జరిగిన మ్యాచ్‌లలో ఇండియా-ఏ తరపున ఆడిన సిరాజ్ సత్తా చాటాడు. దీంతో, అతనికి టీ20ల్లో బెర్త్ దక్కింది.
 
టీ20 టీమ్ ఆటగాళ్లు వీరే...
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తీక్, ధోనీ, హార్దిక్ పాండ్యా, అక్సర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మెహమ్మద్ సిరాజ్, ఆశిష్ నెహ్రా.
 
అయితే ఆశిష్ నెహ్రాను కేవలం ఒక మ్యాచ్‌కు మాత్రమే ఎంపిక చేశారు. ఈ మ్యాచ్ తర్వాత నెహ్రా రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. భారత్-న్యూజలాండ్ మధ్య మొత్తం మూడు టీ20లు జరగనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ చేసే చేపలు, రొయ్యల కూరంటే ఇష్టం: చైనీస్ ఫుడ్ కోసం వెళ్తే.. సచిన్