ధోనీకి నీళ్లు తాగించిన కూతురు జీవా.. గోల్ కీపర్‌గానూ మహీ అదుర్స్.. (ఫోటో)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం ఎక్కడికెళ్లినా తన కుమార్తెతోనే వస్తున్నాడు. తద్వారా ధోనీ కూతురు జీవా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. రాంచీలో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ త
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం ఎక్కడికెళ్లినా తన కుమార్తెతోనే వస్తున్నాడు. తద్వారా ధోనీ కూతురు జీవా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. రాంచీలో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ తర్వాత ధోనీ భారత ఆటగాళ్లను తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. ఆ సందర్భంగా టీమిండియా సభ్యులంతా ధోనీ ఇంట్లో జీవాతో కాసేపు సరదాగా ఆడుకున్నారు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ, జీవాతో ఆడుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీని తరువాత ధోనీ జీవాతో కలిసి మిఠాయి తింటున్న ఓ వీడియోను ఇన్ స్టా గ్రాంలో అభియానులతో పంచుకున్నాడు. తాజాగా తండ్రీ కూతుళ్ల మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత… న్యూజిలాండ్ భారత్ పర్యటనకు వచ్చింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి భారత్- కివీస్‌ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లకు మధ్యలోనే దీపావళి సెలవులు రావడంతో.. సెలబ్రిటీలతో కలిసి క్రికెటర్లు ఫుట్ బాల్ మ్యాచ్ ఆడారు. ముంబై అంధేరీలోని ఫుట్ బాల్ ఎరీనాలో కోహ్లీ నేతృత్వంలోని ఆల్ హార్రట్ ఎఫ్సీ.. అభిషేక్ బచ్చన్ నేతృత్వంలోని ఆల్ స్టార్స్ ఎఫ్సీ జట్టుతో ధార్మిక మ్యాచ్ ఆడింది.
ఈ మ్యాచ్‌లో ధోనీ మెరుగ్గా ఆడాడు. తనకు లభించిన ఫ్రీ కిక్‌ను సద్వినియోగం చేసుకుని గోల్ కీపర్ మార్క్ రాబిన్ సన్‌కు చిక్కకుండా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంచించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ బచ్చన్ జట్టు 7-3 తేడాతో కోహ్లీ టీంను ఓడించింది. ధోనీ రెండు గోల్స్ సాధించి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఆపై విశ్రాంతి సమయంలో అలసిపోయి మైదానంలో కూర్చుని ఉన్న ధోనీకి కుమార్తె జీవా బుడిబుడి అడుగులతో వచ్చి మంచినీళ్లు అందించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుమార్తె ప్రేమగా తండ్రికి మంచినీళ్లు అందిస్తున్న వీడియోపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.