Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కివీస్ క్రికెటర్లు వాంతులు చేసుకున్నారు.. ఎండలకు తట్టుకోలేకపోతున్నారు..

న్యూజిలాండ్ క్రికెటర్లు తొలి వన్డేలో భారత్‌ను మట్టికరిపించారు. ఆతిథ్య జట్టును సొంత గడ్డపైనే ఓడించారు. అయితే కివీస్ ఆటగాళ్లు భారత్ వాతావరణానికి అలవాటు పడలేకపోతున్నారు. ఎండధాటికి తట్టుకోలేకపోతున్నారు. వ

కివీస్ క్రికెటర్లు వాంతులు చేసుకున్నారు.. ఎండలకు తట్టుకోలేకపోతున్నారు..
, సోమవారం, 23 అక్టోబరు 2017 (11:52 IST)
న్యూజిలాండ్ క్రికెటర్లు తొలి వన్డేలో భారత్‌ను మట్టికరిపించారు. ఆతిథ్య జట్టును సొంత గడ్డపైనే ఓడించారు. అయితే కివీస్ ఆటగాళ్లు భారత్ వాతావరణానికి అలవాటు పడలేకపోతున్నారు. ఎండధాటికి తట్టుకోలేకపోతున్నారు. వారం రోజుల క్రితం భారత్ వచ్చిన కివీస్ ఆటగాళ్లు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడారు. ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి డే నైట్ వన్డేలో టీమిండియాతో తలపడ్డారు. 
 
టీమిండియా టాప్ ఆర్డర్‌ను కివీస్ బౌలర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. పరుగులు ఇవ్వకుండా బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు.  ఈ క్రమంలో 21వ ఓవర్‌‌ను వేసేందుకు రంగంలో దిగిన కొలిన్ డి గ్రాండ్‌ హోమ్‌ రెండు బంతులు చక్కగా వేశాడు. మూడో బంతి సంధించేందకు సిద్ధమయ్యేలోపు  మోకాళ్లపై చేతులు ఉంచి మైదానంలోనే వాంతులు చేసుకున్నాడు. వెంటనే జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి హెల్త్ డ్రింక్ ఇవ్వడంతో కాస్త ఉపశమనం పొందాడు. 
 
ఆపై గ్రాండ్ హోమ్ ఆ ఓవర్ పూర్తిచేసి పెవిలియన్ బాట పట్టాడు. డ్రెస్సింగ్ రూంలో విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన బౌల్ట్ భారత్‌లో ఉష్ణతాపం ఎక్కువగా ఉందని, ఆడడం కష్టంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇలా కివీస్ ఆటగాళ్లు భారత వాతావరణానికి అలవాటు పడలేకపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తొలి వన్డేలో కివీస్ గెలుపు: కోహ్లీ శతకం సాధించినా నో యూజ్.. టీమిండియా ఓటమి