Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాదే వరల్డ్ కప్ : బ్రియాన్ లారా

Webdunia
మంగళవారం, 21 మే 2019 (13:02 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టైటిల్‌ ఫేవరేట్ జట్ల జాబితాలో ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. ఇప్పటికే, భారత్‌కు చెందిన క్రికెట్ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, గౌతం గంభీర్‌లు మాత్రం ఆస్ట్రేలియా జట్టును ఫేవరేట్‌గా చెప్పేశారు. కానీ, వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా మాత్రం మరోలా స్పందిస్తున్నాడు. తన ఓటు మాత్రం విరాట్ కోహ్లీ సేనకు వేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. 
 
ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభంకానున్న వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీపై స్పందిస్తూ, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. ప్రస్తుతం టీమిండియా సమతూకంలో ఉందనీ... అన్ని పరిస్థితుల్లోనూ రాణించగల ఆటగాళ్లు జట్టులో ఉన్నందున టైటిల్ గెలుచుకోగలరని జోస్యం చెప్పాడు.
 
'భారత జట్టు విజేతగా అవతరిస్తే ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. విభిన్న పరిస్థితుల్లో సైతం వారు చక్కగా రాణిస్తున్నారు. భారత జట్టు చాలా సమతూకంలో ఉంది. భారత్ బలమైన జట్టు అని చెప్పడంలో సందేహమే లేదు' అని లారా చెప్పుకొచ్చారు.
 
అయితే, సొంతగడ్డపై ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు సైతం ఈ సారి గట్టిపోటీ ఇవ్వగలదని లారా అన్నాడు. 1975లో ఈ టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు ఇంగ్లండ్ ప్రపంచ కప్ గెలుచుకోలేదనీ... దీంతో ఆ జట్టు ఈ సారి గట్టిగానే ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని లారా అభిప్రాయం వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

తర్వాతి కథనం
Show comments