Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

20-05-2019 దినఫలాలు - ఈశ్వరుడిని పూజించి అర్చించినా...

webdunia
సోమవారం, 20 మే 2019 (08:37 IST)
మేషం : సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. దైవ, సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకు స్థానమార్పిడి, కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. 
 
వృషభం : ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికంగా ఉంటుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. 
 
మిథునం : వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో విభేదాలు తలెత్తాయి. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. మీ సంతానం ఉన్నత విద్య గురించి మంచి మంచి ఆలోచనలు, పథకాలు వేస్తారు. మిమ్మల్ని పొగిడేవారే కానీ, సహకరించేవారుండరు. 
 
కర్కాటకం : మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ ఇన్వెర్టర్ రంగాల్లో వారికి పనిభారం అధికం. మనషుల మనస్తత్వం తెలిసి మసలుకొనుట మంచిది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతాయి. 
 
సింహం : ఆర్థిక వ్యవహారాలు, ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ వాక్‌చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. 
 
కన్య : రిప్రజెంటేటివ్‌లకు, ప్రేవేటు సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ శ్రీమతి, సంతానం గొంతెమ్మ కోరికలు చికాకుపరుస్తాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ వైద్య రంగాల వారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి. 
 
తుల : విదేశాల్లోని ఆత్మీయులకు ప్రియమైన వస్తువులు అందజేస్తారు. పెద్దమొత్తం నగదుతో ప్రయాణాలు మంచిదికాదు. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తికాగలవు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు అమలు చేస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదు. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. 
 
వృశ్చికం : ఆదాయ వ్యయాలు, వ్యాపారాల అభివృద్ధికి చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. ఒక స్థిరాస్తి కొనుగోలు అనుకూలిస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. పత్రికా సిబ్బందికి ఓర్పు, పునఃపరిశీలన ముఖ్యం. సాహస ప్రయత్నాలు విరమించండి. ఆపత్సమయంలో ఆత్మీయులు ఆసరాగా నిలుస్తారు. 
 
ధనస్సు : ఉమ్మడి కార్యక్రమాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. స్త్రీల ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. నోరు అదుపులో ఉంచుకోవడం మంచిది. 
 
మకరం : కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. బంధువుల ఆకస్మికరాక ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవరం. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. 
 
కుంభం : ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల ఆకర్షితలవుతారు. స్థిరబుద్ధి లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. సోదరీ సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. 
 
మీన : ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవచ్చును. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారు. గమనించండి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. నేడు చేజారిన అవకాశం కలిసివస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధవహించడి. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

ఆదివారం (19-05-2019) మీ రాశి ఫలాలు... పాత రుణాలు...