Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-05-2019 శుక్రవారం దినఫలాలు

Advertiesment
17-05-2019 శుక్రవారం దినఫలాలు
, శుక్రవారం, 17 మే 2019 (07:35 IST)
మేషం : పీచు, ఫోమ్, లెదర్, చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. స్త్రీలు తమ అధిక్యతను చాటుకునే యత్నాలలో ఇబ్బందులెదుర్కోక తప్పదు. ప్రైవేటు సంస్థల వారికి రిప్రజెంటేటివ్‌లకు పనిభారం వల్ల ఆరోగ్యంలో చికాకులు ఎదుర్కుంటారు. భాగస్వామిక వ్యాపారాలు, స్థిరాస్తి వ్యవహారాల్లో మెళకువ వహించండి.
 
వృషభం : ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన విషయాల్లో మెళకువ వహించండి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు.
 
మిథునం : బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పదు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. మిర్చి, నూనె, ఆవాలు, చింతపండు, వెల్లుల్లి వ్యాపారులకు, స్టాకిస్టులకు వేధింపులు అధికమవుతాయి. నిరుద్యోగులు ఏ చిన్న అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది.
 
కర్కాటకం : రవాణా రంగంలోని వారికి చికాకులు తప్పవు. స్త్రీలు పనిభారంతో చికాకులు ఎదుర్కొంటారు. సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, ఇన్వెర్టర్, ఏసీ మెకానికల్ రంగాలవారికి పురోభివృద్ధి. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.
 
సింహం : కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. మీ ఏమరుపాటుతనం, నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. రుణం తీర్చడానికై చేయుయత్నాలు వాయిదాపడతాయి. ప్రేమికుల మధ్య అపోహలు, అపార్థాలు తొలగిపోయి ప్రేమానుబంధాలు బలపడతాయి.
 
కన్య : ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పదు. బంధువర్గాల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. గృహంలో మార్పులు, చేర్పులకై చేయుయత్నాలలో ఆటంకాలు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటుకాగలదు.
 
తుల : సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంతకాలం వాయిదావేయడం క్షేమదాయకం. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. బంధువుల రాక, అనుకోని ఖర్చుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు.
 
వృశ్చికం : కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అంతగా అనుకూలించవు. స్త్రీల అసంతృప్తి ధోరణి వల్ల కుటుంబంలో ప్రశాంతత కరవువతుంది. హోటల్, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. చిన్నతరహా వృత్తులవారికి సదావకాశాలు.
 
ధనస్సు : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. వస్త్ర, బంగారు వెంటి, రత్న వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. క్రయ విక్రయ రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. సినిమా రంగాలలో వారికి చికాకులు తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలలో సఫలీకృతులవుతారు.
 
మకరం : ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ పనివారలకు సంతృప్తికరంగా ఉంటుంది. ఇతరులను గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఉద్యగోస్తులకు తోటివారి ద్వారా ఆసక్తికరమైనవార్తలు అందుతాయి.
 
కుంభం : ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. స్త్రీలకు బంధువులు, చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహమరమ్మతులు చేపడుతారు. ఉపాధ్యాయులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. రావలసిన ధనంలో కొంతభాగం వసూలు కాగలదు.
 
మీనం : ఏజెంట్లకు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తుల వారికి, చిరు వ్యాపారులకు లాభదాయకం. బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. స్టాక్ మార్కెటింగ్ రంగాల వారికి సామాన్యం, వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16-05-2019 రాశిఫలాలు : దత్తాత్రేయుడుని ఆరాధించిన సంకల్పసిద్ధి