Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

15-05-2019 బుధవారం రాశిఫలాలు - గాయత్రి మాతను ఆరాధిస్తే శుభం...

webdunia
బుధవారం, 15 మే 2019 (08:46 IST)
మేషం: రాజకీయ నాయకులు సభా సమావేశాల్లో పాల్గొంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. 
 
వృషభం: యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కోవలసివస్తుంది. మీ అభిప్రాయాలను కుటుంబీకులు గౌరవిస్తారు. 
 
మిథునం: తలపెట్టిన పనులు మందకొడిగా పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
కర్కాటకం: ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై బాగా ప్రభావం చూపుతాయి. చిట్స్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. అపరాలు, ధాన్యం, వాణిజ్య వ్యాపారులకు సంతృప్తి. పురోభివృద్ధి. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు.
 
సింహం: ఆర్థికలావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. తెలివి తేటలతో వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి. ఇతరుల పని పై ఆసక్తి చూపుతారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి వుండాల్సి వస్తుంది.
 
కన్య: వ్యాపారాల్లో పెరిగిన పోటీవల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రతి విషయంలోను స్వయంకృషిపైనే ఆధారపడటం మంచిది. ఆశించిన ఆదాయం అందకపోవడం వల్ల ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. 
 
తుల: ఆర్థికస్థితిలో ఏమాత్రం పురోభివృద్ధి ఉండదు. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. కొబ్బరి, పండ్ల, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. దైవ ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన తప్పదు.
 
వృశ్చికం: దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం వుంది. భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్‌లకు కొంతమంది అవరోధం కల్పిస్తారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు.
 
ధనస్సు: విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా వుంచడం శ్రేయస్కరం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. హోటల్, క్యాటరింగ్ పనివారలకు, చిరు వ్యాపారులకు అనుకూలం.
 
మకరం: శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు, ప్రైవేట్ సంస్థల్లో వారికి మార్పులకే చేయు ప్రయత్నాలు అనుకూలంచవు. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. 
 
కుంభం: కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు అన్నివిధాలా కలిసిరాగలదు. స్త్రీలకు బంధువుల నుంచి మొహమ్మాటం, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. స్త్రీలు, టీవీ ఛానల్స్ కార్యక్రమాల్లో రాణిస్తారు. ఆపద సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. 
 
మీనం: ప్రముఖుల ప్రమేయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆదాయంలో చక్కని అభివృద్ధి కనిపిస్తోంది. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మోసపోయే ఆస్కారం వుంది. ఉద్యోగస్తుల హోదా పెరిగే ఆస్కారం వుంది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

నవరత్నాలు ధరించడం ద్వారా ఆ రోగాలు తొలగిపోతాయట?