Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

10-05-2019 దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి అర్చిన శుభం కలుగుతుంది...

webdunia
శుక్రవారం, 10 మే 2019 (08:19 IST)
మేషం : బంధువులకు సహకరించి వారికి మరింత సన్నిహితులవుతారు. మీ కార్యక్రమాలు, పనులు, అనుకున్నంత సజావుగా సాగవు. దంపతుల మధ్య సఖ్యత లోపం, పట్టింపులు అధికం. ఒక స్థిరాస్తి కొనుగోలు నిమిత్తం కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతారు. స్త్రీలు శుభకార్యాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. 
 
వృషభం : మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఐరన్, సిమెంట్, కలప, ఇటుక, ఇసుక రంగాలలోని వారికి కలిసివచ్చే కాలం. కుటుంబ సమేతంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శనకు సన్నాహాలు చేస్తారు. ఫ్యాన్సీ, మందులు, రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసిరాగలదు. 
 
మిథునం : స్త్రీల మాటకు ఇంటా బయటా మంచి స్పందన లభిస్తుంది. గృహ మరమ్మతులకు అనుకూలం. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. దంపతుల మధ్య సఖ్యత లోపం, పట్టింపులు అధికమవుతాయి. ఉద్యోగం చేసే చోట అస్థిరత నెలకొనివుంటుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. 
 
కర్కాటకం : రాజకీయ, వృత్తి వ్యాపారాల్లో మార్పులు కనిపిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ఆలయాలను సందర్శిస్తారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. ఏ విషయమైన పూర్తిగా తెలుసుకోకుండా నిర్ధారణకు రావడం మంచిది కాదు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. 
 
కన్య : ఓ చిన్న విహార యాత్ర చేస్తారు. కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి పొందుతారు. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాంట్రాక్టర్లకు నాణ్యతాలోప నిర్మాణాల వల్ల కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. చిట్‌ఫండ్, ఫైనాన్స్ రంగాల వారికి చికాకులు తప్పవు. వృధా ఖర్చులు అధికమవుతాయి. 
 
తుల : రియల్ ఎస్టేట్, ఏజెంట్లకు బ్రోకర్లకు కలిసివచ్చేకాలం. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. పెరిగిన ధరలు, కుటుంబ సమస్యలను వేధిస్తాయి. 
 
వృశ్చికం : దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. క్లిష్ట సమయంలో బంధుమిత్రులు జారుకుంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ కంప్యూటర్ రంగాల వారికి కలిసివస్తుంది. మీ సంతానం మొండివైఖరి వల్ల చికాకులు ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : ఆర్థికంగా కొంతమేరకు మెరుగుపడుతుంది. వాహన చోదకులకు ఏకాగ్రత అవసరం. దైవదర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. వాయిదా చెల్లింపులకు సంబంధించి ఒత్తిడి ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి.
 
మకరం : పత్రికా సిబ్బందికి ఉద్యోగ భద్రత విషయంలో ఆందోళన కలిగిస్తుంది. ధనం బాగా ఖర్చు చేస్తారు. సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. బంధువులతో సత్సంబంధాలు సన్నగిల్లుతాయి. అవగాహన లోపం వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. ప్రయాణాల ఆలోచన విరమించుకోవడం శ్రేయస్కరం. 
 
కుంభం : విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో సున్నితంగా మెలగాలి. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు ప్రమోషన్, స్థానచలనం వంటి ఫలితాలున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో మీ శ్రీమతి సలహా పాటించడం మంచిది. 
 
మీనం : ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. అర్థాంతరంగా నిలిపివేసిన గృహమరమ్మతులు, పనులు పునఃప్రారంభిస్తారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయాలలో జాగ్రత్త వహించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

09-05-2019 గురువారం దినఫలాలు - దత్తాత్రేయుడని ఆరాధించి మీ సంకల్పం సిద్ధిస్తుంది