Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

06-05-2019 దినఫలాలు - ఉమాపతిని ఆరాధించినట్టయితే...

webdunia
  • facebook
  • twitter
  • whatsapp
share
సోమవారం, 6 మే 2019 (08:45 IST)
మేషం : వస్త్ర, బంగారు, వెండి రంగాల పట్ల ఆసక్తి పెరుగును. ప్రయాణాల వ్యవహారాల్లో మెలకువ వహించడి. రాజకీయ నాయకులకు ఊహించిన మార్పులు చోటుచేసుకుంటాయి. బంధువులను కలుసుకుంటారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. దంపతుల మధ్య అవగాహనా లోపం తప్పదు. 
 
వృషభం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. స్త్రీలకు చుట్టుపక్కల వారిలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. సోదరీ సోదరుల మధ్య ఏకీభావం కుదరదు. పోస్టల్, కొరియర్ రంగాల వారు ఒత్తిడి ఎదుర్కొంటారు. క్రీడా, కళా, సాంస్కృతిక రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మిథునం : ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు ఒక కొలిక్కి రాగలవు. సన్నిహితుల మధ్య రహస్యాలు దాచడం వల్ల విభేదాలు తలెత్తవచ్చు. కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, వాణిజ్య రంగాల్లో వారికి ఆశించినంత ఫలితం ఉండదు. 
 
కర్కాటకం : వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. రుణ విముక్తుల కావడంతో పాటు తాకట్టులు విడిపించుకుంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. దూర ప్రయాణాలలో బంధుమిత్రులను కలుసుకుంటారు. 
 
సింహం : సోదరులతో ఏకీభవించలేరు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. సన్నిహితుల ఆర్థిక పరిస్థితుల మనస్తాపం కలిగిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగ విరమణ చేసిన వారికి తోటివారు సాదర వీడ్కోలు పలుకుతారు. సంస్థల నుంచి పారితోషికం అందుకుంటారు. 
 
కన్య : గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. కొన్ని అనుకోని సంఘటనలు ఇరకాటానికి దారితీస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులున్నా భారమనిపించవు. పట్టుదల, ఓర్పుతోనే అనుకున్నది సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తాడు. వైద్య రంగాల వారికి ఆపరేషన్ల సమయంలో ఏకాగ్రత ముఖ్యం. 
 
తుల : బంధువుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాగలవు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఏసీ కూలర్లు, ఇన్వెర్టర్ల రంగాలలో వారికి శుభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ఖర్చులెదురైనా కావలిసిన ధనం సర్దుబాటు కాగలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
వృశ్చికం : రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పొదుపు పథకాలు, పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. గత తప్పిదాలు పునరావృత్తమయ్యే ఆస్కారం ఉంది. కొబ్బరి, పండ్లు, చల్లని పానీయ వ్యాపారస్తులకు కలిసివచ్చేకాలం. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. 
 
ధనస్సు: జీవితభాగస్వామి సలహాలతో ముందుకుసాగుతారు. ఉద్యోగస్తులకు నగదు బహుమతి, ప్రత్యేక ఇంక్రిమెంట్ వంటి శుభపరిణామాలున్నాయి. ఖర్చులు అధికమవుతాయి. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలాహాలు ఎదుర్కోవలసి వస్తుంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అధికమవుతాయి. 
 
మకరం : వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రేమికుల ఎడబాటు, చికాకులు తప్పవు. ప్రముఖులను కలుసుకుంటారు. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత అవసరం. రచయితలకు, పత్రికా రంగంలోని వారికి వారి స్థాయి పెరుగుతుంది. దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
కుంభం : ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మితిమీరిన శరీర శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. చేబదుళ్ళ కోసం తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. స్త్రీలకు నరాలు, వెన్నెముక దంతాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. 
 
మీనం : లీజు, నూతన పెట్టుబడులు, టెండర్ల వ్యవహరాల్లో పునరాలోచన మంచిది. వృత్తులవారికి శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. భాగస్వామిక సమావేశాలు అర్థాంతరంగా ముగుస్తాయి. 

Share this Story:
  • facebook
  • twitter
  • whatsapp

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

webdunia
05-04-2019 ఆదివారం మీ రాశిఫలాలు... పనులు మరొకరికి అప్పగించి...