Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

04-05-2019 శనివారం రాశిఫలాలు .. ఈశ్వరునికి అభిషేకం చేయించినా...

Advertiesment
04-05-2019 శనివారం రాశిఫలాలు .. ఈశ్వరునికి అభిషేకం చేయించినా...
, శనివారం, 4 మే 2019 (08:47 IST)
మేషం : మీ సంతానం, కళత్రమొండివైఖరి వల్ల కుటుంబంలో కలహాలు, చికాకులు అధికమవుతాయి. హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. రాబడిని పెంచుకునే మార్గాలపై దృష్టిసారిస్తారు. 
 
వృషభం : స్వర్ణకార పనివారలు, వ్యాపారులకు ఊహించని చికాకులెదురవుతాయి. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు సన్నిహితుల ద్వారా అందిన ఒక సమాచారం ఎంతో ఉపకరిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ వహించండి. విద్యార్థినులు ప్రేమికుల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. 
 
మిథునం : మీ బంధువుల కారణంగా మాటపడవలసి వస్తుంది. ఉద్యోగస్తులు అంకితభావంతో పని చేసి అధికారులను మెప్పిస్తారు. ఇతరుల విషయాల్లో అతిగా వ్యవహరించడం వల్ల మాటపడక తప్పదు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరం. మందులు, కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారస్తులకు మంచి లాభాదాయకంగా ఉంటుంది. 
 
కర్కాటకం : ఏదేని స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్, సాంకేతిక రంగాల వారికి కలిసివస్తుంది. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయ. కొత్త ప్రదేశాల సందర్శనలు, దైవ దర్శనాలు ఉత్సాహాన్నిస్తాయి. 
 
సింహం : ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యుల సహకారం వల్ల సమసిపోతాయి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. అదనపు సంపాదన పట్ల దృష్టిసారిస్తారు. బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. 
 
కన్య : కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. భాగస్వామిక చర్చలు వాయిదాపడతాయి. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. సమయానికి కావాల్సిన వస్తువు కనిపించకపోయే ఆస్కారం ఉంది. 
 
తుల : మీ ఆర్థిక పరిస్థితులు ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా సాఫీగా సాగిపోతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. ఆపద సమయంలో సన్నిహితుల అండగా నిలుస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పాత అలవాట్లకు స్వస్తి చెప్పి నూతన జీవితాన్ని ప్రారంభించండి. 
 
వృశ్చికం : ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు అధికం. ఆస్తి పంపకాల విషయంలో సోదరులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. 
 
ధనస్సు : స్త్రీలకు వస్త్రప్రాప్తి, వాహనయోగం వంటి శుభఫలితాలున్నాయి. మీ అవసరాలు, కోరికలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. గృహ మరమ్మతుల వ్యయం మీ అంచనాలను మించుతుంది. దంపతుల మధ్య కొత్త ఆలోచనులు స్ఫురిస్తాయి. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు భిన్నంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
మకరం : ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. అనుకున్న లక్ష్యం సాధించడంతో మానసిక ప్రశాంతతను పొందుతారు. వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి లాభదాయకం. నిరుద్యోగులు ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. అనుభవజ్ఞులైన పెద్దల సలహాను పాటించడం వల్ల ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. 
 
కుంభం : ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పత్రిక ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ చిన్నారుల కోసం ధనం విరిగా వ్యయం చేస్తారు. సన్నిహితుల రాక సంతోషం కలిగిస్తుంది. తలపెట్టిన పనులు మందకొడిగా పూర్తి చేస్తారు. 
 
మీనం : రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఊహించని ఖర్చుల వల్ల ఒకింత ఒడిదుకుడులు ఎదుర్కొంటారు. పారిశ్రామిక రంగాల్లో వారికి ప్రతికూల వాతావరణం నెలకొని ఉంటుంది. తాపీపనివారు, నిరుద్యోగులు తొందరపాటుతనం వల్ల సదావకాశాలు జారవిడుచుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

03-05-2019 శుక్రవారం మీ రాశి ఫలితాలు- నూతన ప్రదేశాల సందర్శనలో...