Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

01-05-2019 బుధవారం దినఫలాలు - మేషరాశివారు ఇలా చేయడం వల్ల...

Advertiesment
01-05-2019 బుధవారం దినఫలాలు - మేషరాశివారు ఇలా చేయడం వల్ల...
, బుధవారం, 1 మే 2019 (09:06 IST)
మేషం: ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. టి.వి., మీడియా రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. సోదరీసోదరులతో ఏకీభావం కుదరదు. ఉత్తర, ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు.
 
వృషభం: రిప్రజెంటేటివ్‌లకు అధిక శ్రమ, చికాకులు తప్పవు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రేమికుల ఆలోచనలు పెడదోవ పట్టే ఆస్కారం ఉంది. ఆకస్మిక ఖర్చుల వలన ఒకింత ఒడిదుడుకులు తప్పవు. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఇబ్బంది కలిగిస్తాయి. స్త్రీలు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
 
మిధునం: ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. నూతన దంపతులకు శుభదాయకం. గృహంలో శుభకార్యానికై చేయు యత్నలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. రచయితలకు పత్రికా రంగలవారికి చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం.
 
కర్కాటకం: విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో పునరాలోచన అవసరం. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఖాదీ, చేనేత, నూలు వస్త్ర వ్యాపారులకు పురోభివృద్ధి.
 
సింహం: చేతి వృత్తుల వారికి ఆశాజనకం. స్త్రీలకు వస్త్ర, ఆభరణాల కొనుగోలు విషయంలో మెళకువ అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. కళా, క్రీడాకారులకు శుభదాయకం. మీ విషయాల్లో ఇతరుల జోక్యం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
కన్య: కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. గృహంలో శుభకార్యానికై చేయు యత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. రచయితలకు పత్రికా రంగాలవారికి చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం.
 
తుల: ఎ.సి. కూలర్లు మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవచ్చును. ఆరోగ్యంలో చిన్న చిన్న చికాకులు తప్పవు. డాక్టర్లకు లాభదాయకం. ఆడిటర్లకు పనిభారం పెరుగుతుంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు.
 
వృశ్చికం: విద్యార్థులకు దూరప్రాంతాల నుండి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ సంస్థల్లో వారు జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. నూతన ప్రదేశ సందర్శన వలన పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిర్మాణ పనులలో జాప్యం వంటివి తప్పదు.
 
ధనస్సు: ఉద్యోగస్తులకు అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. సన్నిహితులను కలుసుకుంటారు. ఆరోగ్యంలో మెళకువ అవసరం. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. షామియాన, సప్లయ్ రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది.
 
మకరం: మార్కెటింగ్ రంగాల వారికి, ఏజెంట్లకు, బ్రోకర్లకు యాజమాన్యం ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఏకాగ్రత ముఖ్యం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. కలప, ఇటుక, ఐరన్ వ్యాపారులకు అనుకూలం. అదనపు సంపాదన కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి.
 
కుంభం: నూతన వస్తువులు వాహనాలు కొంటారు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆందోళన తప్పదు. మీ విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తత అవసరం. ఉద్యోగస్తులు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. వైద్య రంగాలవారికి చికాకులు అధికమవుతాయి.
 
మీనం: ఆర్థిక విషయాల్లో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. టెక్నికల్, కంప్యూటర్ రంగాలలోని వారికి సత్‌కాలం. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. స్త్రీలకు వస్త్ర, ఆకస్మిక ధనలాభం వంటి శుభపరిణామాలున్నాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. స్త్రీల తొందరపాటుతనం వలన ఇబ్బందులు ఎదుర్కుంటారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్రిశూలంలో నిమ్మపండు ఎందుకు..? నిమ్మచెక్కలతో రాహుకాలంలో దీపం పెడితే?