Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-04-2019 శుక్రవారం దినఫలాలు - విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి...

Advertiesment
26-04-2019 శుక్రవారం దినఫలాలు - విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి...
, శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (08:48 IST)
మేషం: బ్యాంకు వ్యవహారాలు హడావుడిగా పూర్తిచేస్తారు. ఖర్చులు అధికమవుతాయి. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. ప్రైవేటు సంస్థల్లోని మదుపు, వ్యక్తులకు రుణం ఇవ్వడం మంచిది కాదు. సోదరీసోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. స్త్రీలకు అయిన వారిని చూడాలనే కోరిక స్పురిస్తుంది.
 
వృషభం: రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోవడం ఉత్తమం. బంధుత్వాల మధ్య ఏర్పడిన సందిగ్ద పరిస్థితులు తీరిపోతాయి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికం. దంపతుల మధ్య అపార్థాలు తలెత్తుతాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
మిథునం: లాయర్లు అసాధ్యమనుకున్న కేసులను సునాయాసంగా గెలుపొందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారులు చికాకులు తప్పవు. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలనే మీ నిర్ణయం బలపడుతుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఇతరుల విషయాలకు వీలైనంత దూరంగా ఉండడం క్షేమదాయకం.
 
కర్కాటకం: ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో పెద్దల సలహా పాటించడం మంచిది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిగిరాగలదు. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవడానికి యత్నించండి. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు అనుకూలం.
 
సింహం: గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడుతాయి. పత్రికా సంస్థల్లోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ, విత్తన వ్యాపారులకు, స్టాకిస్టులకు ఆర్ధికాభివృద్ధఇ కానవస్తుంది.
 
కన్య: ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. రాజకీయాలకు సంబంధించిన ఆలోచనలు చుట్టు ముడతాయి. దైవ, సాంఘిక, సేవా కార్యక్రమాల పట్ల శ్రద్ధ కనపరుస్తారు. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీల వాక్ చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
తుల: కొన్ని విలువైన వస్తువుల అనుకోకుండా కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో ప్రశాంతత లోపం, ఆరోగ్య సమస్యలు వంటి చికాకులు అధికమయ్యే అవకాశం ఉంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
వృశ్చికం: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. పెంపుడు జంతువులు పట్ల మెళకువ అవసరం. ఎ.సి.కూలర్ మెకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. బంధువుల రాకపోకల వలన గృహంలో సందడి కానవస్తుంది. నిరుద్యోగులకు ఆశాజనకం. 
 
ధనస్సు: ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు, స్టాకిస్టులకు అనుకూలమైనకాలం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. మీ శ్రీమతిసూటిపోటి మాటలు అసహానం కలిగిస్తాయి. స్త్రీలకు టీ.వీ ఛానెళ్ల నుండి ఆహ్వానం, కానుకలు అందుతాయి. 
 
మకరం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. వ్యాపారాభివృద్ధికై చేయు యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఉద్యోగస్తుల క్రమశిక్షణ, పనితీరు అధికారులను ఆకట్టుకుంటాయి. రాబటికి తగినట్టు ఖర్చులు ఉంటాయి. 
 
కుంభం: కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభాదాయకంగా ఉంటుంది. ఊహించని ఒత్తిడి, చికాకులు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వహిస్తారు. దైవ, సేవా కార్యాక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. 
 
మీనం: కంది, మినుము, పెసర, ఎండుమిర్చి, నూనె వ్యాపారస్తులకు మెళకువ అవసరం. మిత్రులు కూడా మీకు దూరంగా ఉండడానికి యత్నిస్తారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ముఖ్యం. ఊహించని ఖర్చులు ఎదురైనా ఇబ్బందులు అంతగా ఉండవు. దైవ కార్యాల నిమిత్తం ప్రయాణాలు చేయవలసివస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వంటగది నిర్మాణానికి కొన్ని వాస్తు చిట్కాలు..?