Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24-04-2019 - బుధవారం మీ రాశిఫలితాలు - రావలసిన ధనం చేతికి అందడంతో

Advertiesment
24-04-2019 - బుధవారం మీ రాశిఫలితాలు - రావలసిన ధనం చేతికి అందడంతో
, బుధవారం, 24 ఏప్రియల్ 2019 (09:17 IST)
మేషం: ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. ఖర్చులకు సరిపడా ధనం సమకూరుట వలన ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. రాజకీయాల వారు కార్యకర్తల వలన సమస్యలను ఎదుర్కొనక తప్పదు. కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. వృత్తి, ఉద్యోగాలలో వారికి ఆదాయం బాగుంటుంది.
 
వృషభం: టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానకి విషయాలపట్ల ఆసక్తి పెరుగును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించిన జార విడుచుకుంటారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. గృహంలో మార్పులకు, చేర్పులకు వాయిదా పడుతాయి. స్త్రీలకు నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. 
 
మిధునం: ఇతరుల ఆంతరంగిక విషయాలలో తలదూర్చడం వలన మాటపడవలసివస్తుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలవారికి అనుకూలం. క్రీడా రంగాలవారికి చికాకులు తప్పవు. ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. రచయితలకు, పత్రికా రంగాలవారికి సామాన్యం.
 
కర్కాటకం: ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోనివారికి మిశ్రమ ఫలితం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అధిక శ్రమ, చికాకులు తప్పవు. ఎలక్ట్రికల్ రంగాలలోని వారికి సామాన్యంగా ఉండగలదు. మీ సంతాన విషయంలో సంతృప్తి కానవస్తుంది. దూరంలో ఉన్న వ్యక్తుల గురించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.
 
సింహం: ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. అనురాగ వాత్సల్యాలు పొందగలవు. ప్రయాణాలలో కొంత ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీ పాత సమస్యలు పరిష్కరించబడుతాయి. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసివస్తుంది.
 
కన్య: బ్యాంకింగ్ వ్యవహారంలో జాగ్రత్త అవసరం. కాంట్రాక్టర్లు ప్రముఖల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. నిరుద్యోగులకు ప్రకటనల విషయంలో అప్రమత్తత అవసరం. 
 
తుల: రావలసిన ధనం చేతికి అందడంతో రుణం తీర్చగలుగుతారు. మార్కెటింగ్ రంగాలలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. బంధువుల నుండి వ్యతిరేకత, పట్టింపులు ఎదురవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. తొందరపాటు నిర్ణయాల వలన నష్టాలు ఎదుర్కోవలసివస్తుంది. మొక్కుబడులు తీర్చుకుంటారు.
 
వృశ్చికం: బంగారు, వెండి, వస్త్రం రంగాలలో వారికి మెళకువ అవసరం. దంపతుల మధ్య కలహాలు, పట్టింపులు ఎదుర్కుంటారు. మీ సంతానం వివాహం, విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఒక స్థాయి వ్యక్తుల కలయిక ఆశ్చర్యం కలిగిస్తుంది. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. 
 
ధనస్సు: మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. క్రయవిక్రయ రంగాలలో వారికి అనుకూలం. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మకరం: వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. వాహన చోదకులకు చికాకులు తప్పవు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది.
 
కుంభం: మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. వైద్య రంగాలలో వారికి శుభకార్యములకై చేయు యత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగస్తులకు రావలసిన క్లెయిములు మంజూరవుతాయి. 
 
మీనం: విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. అకాల భోజనం వలన ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ఆత్మీయులను విమర్శించుట వలన చికాకులను ఎదుర్కుంటారు. రవాణా రంగాలలోని వారికి లాభదాయకం. రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు, బ్రోకర్లకు, ఎక్స్‌పోర్ట్ వ్యాపారస్టులకు వారి వారి రంగాలలో విజయం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయ్యప్పను పూజించడం వలన ఏమవుతుంది..?