Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-04-2019 ఆదివారం మీ రాశిఫలాలు... పనులు మరొకరికి అప్పగించి...

Advertiesment
05-04-2019 ఆదివారం మీ రాశిఫలాలు... పనులు మరొకరికి అప్పగించి...
, ఆదివారం, 5 మే 2019 (08:36 IST)
మేషం : ఉన్నత విద్యా, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. వితండవాదాలు, హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. మీ బాద్యతలు, పనులు మరొకరికి అప్పగించి ఇబ్బందులెదుర్కొంటారు. ఆలయాలను సందర్శిస్తారు.
 
వృషభం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. పరిశోధకులకు, గణిత, సైన్సు ఉపాధ్యాయులకు గణనీయమైన పురోభివృద్ధి. ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. చిన్నతరహా, చిరు వ్యాపారులకు ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం.
 
మిథునం : నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. సాహస ప్రయత్నాలకు సరియైన సమయం కాదని గమనించండి. ప్రముఖుల పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. తలపెట్టిన పనులు సమయానికి పూర్తి కావు. పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
కర్కాటకం : కుటుంబ అవసరాలు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. కొంతమంది మిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్ధి పొందటానికి యత్నిస్తారు. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి.
 
సింహం : వృధా ఖర్చులు అదుపుచేయాలన్న మీ యత్నం నెరవేరదు. రిప్రజెంటివ్‌లకు, మార్కెటింగ్ రంగాల్లో వారికి ప్రయాణాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేటు సంస్థల్లో వారు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. దంపతుల మధ్య ఏకీభావం కుదరదు. ఉత్తర ప్రత్యుత్తరాలలో సంతృప్తిగా సాగుతాయి.
 
కన్య : మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన కుదరదు. ముఖ్యుల మధ్య ఆకస్మిక అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు. దైవ, పుణ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
 
తుల : ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. సోదరి, సోదరుల అవగాహన కుదరదు. నూతన పరిచయస్తుల మీ నుండి ధనం లేక హామీలు అర్థిస్తారు జాగ్రత్త వహించండి. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనిలో ఆటంకాలు తప్పవు. స్పెక్యులేషన్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులను కలుసుకుంటారు.
 
వృశ్చికం : నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. పత్రిక, మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఏ పని చేద్దామనుకున్నా పరిస్థితులు అనుకూలించవు. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. మీ సంతానం మొండితనం ఇబ్బందులకు దారితీస్తుంది. పాత రుణాలు తీరుస్తారు.
 
ధనస్సు : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. మీ బాధ్యతలు, పనులు మరొకరికి అప్పగించి ఇబ్బందు లెదుర్కుంటారు. నిత్యవసర వస్తు స్టాకిస్టులు, ఎరువులు, క్రిమి సంహారక మందుల వ్యాపారులకు చికాకు తప్పవు. రావలసిన ధనం అతికష్టంమ్మీద వసూలువుతుంది. స్త్రీలకు పని భారం అధికం.
 
మకరం : విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. స్థిరాస్తి కొనుగోలు, లేదా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కుంభం : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. గృహనిర్మాణాల్లో కాంట్రాక్టర్లకు ఒత్తిడి, చికాకులు పెరుగుతుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది.
 
మీనం : రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. విదేశీయ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యాసంస్థల్లో వారికి సమస్యలు తలెత్తుతాయి. అకాలభోజనం, శ్రమాధిక్తవల్ల ఆరోగ్యం మందగిస్తుంది. అనుభవజ్ఞుడు సలహా తీసుకోవడం వల్ల అభివృద్ధి పొందుతారు. ఖర్చులు ఆందోళనలు కలిగిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

05-05-2019 నుంచి 11-05-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)