Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

08-05-2019 దినఫలాలు - మహావిష్ణువును ఆరాధించిన పురోభివృద్ధి...

Advertiesment
08-05-2019 దినఫలాలు - మహావిష్ణువును ఆరాధించిన పురోభివృద్ధి...
, బుధవారం, 8 మే 2019 (09:15 IST)
మేషం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ పాత సమస్యలు పరిష్కార దిశగా పయనిస్తాయి. 
 
వృషభం : వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో మంచి ఫలితాలుంటాయి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. రుణవిముక్తులు కావడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. 
 
మిథునం : ఎదుటివారి తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించడం మంచిది. స్త్రీలకు ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు. ఖర్చులు అధికమవుతాయి. గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. చిన్న తరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు మిశ్రమ ఫలితం. 
 
కర్కాటకం : ట్రాన్స్‌పోర్టు, మెకానికల్, ఆటో మొబైల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలు ఎదుర్కొంటారు. రావలసిన ఆదాయం గురించి ఆందోళన చెందుతారు. పారిశ్రామిక రంగంలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. 
 
సింహం : స్థిరాస్తి నుంచి ఆదాయం, మొండిబాకీలు వసూలు కాగలవు. బంధువులను కలుసుకుంటారు. వృత్తిపరంగా ఎదురైన సమస్య తొలగిపోతాయి. డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది. మీ అవసరాలకు తాకట్టు పెడతారు. చేపట్టిన పనుల పట్ల ఆసక్తి అంతగా ఉండదు. స్త్రీల మాటకు మంచి స్పందనలభిస్తుంది. 
 
కన్య : రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తగలడంతో పొదుపు సాధ్యం కాదు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. బంధువుల తాకిడి పెరుగుతుంది. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యసాధనకు ఓర్పు పట్టుదల ముఖ్యం. కొన్ని విషయాలలో తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగు వేస్తారు. 
 
తుల : విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరులతో ఒక అవగాహన కుదురుతుంది. స్త్రీలు, టీవీ చానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధికమిస్తారు. వాహనచోదకులకు ఊహించని సమస్యలెదురవుతాయి. 
 
వృశ్చికం : పారిశ్రామికరంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. ఉపాధ్యాయులు ప్రమోషన్లు, కోరుకున్న చోటికి బదీలీలు వంటి శుభపరిణామాలు ఉంటాయి. 
 
ధనస్సు : వ్యాపారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కిరణా, ఫ్యాన్సీ, మందులు, పానీయ, ఆల్కహాలు వ్యాపారస్తులకు పురోభవృద్ధి. ఏ పని తలపెట్టినా తిరిగి మొదటికే వస్తుంది. 
 
మకరం : స్త్రీలకు అలంకారాలు విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. బంధువుల నుంచి ఒత్తిడి మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్లు తప్పవు. నూతన వస్తువులను అమర్చుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
కుంభం : ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. రచయితలకు పత్రికా రంగాల వారికి చికాకులు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహాయ సహకారాలు అందిస్తారు. 
 
మీనం : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిర్మాణ పనులలో జాప్యం, అధిక వ్యయం వల్ల ఆందోళనకు గురవుతారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో నిలిపివేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాటిని చిరునవ్వుతో స్వీకరిస్తే జీవనభారం తగ్గుతుంది...