Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

12-05-2019 ఆదివారం మీ రాశి ఫలితాలు.. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా?

webdunia
ఆదివారం, 12 మే 2019 (10:31 IST)
మేషం: శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. స్థిరచరాస్తుల విషయమై కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సంతృప్తికరంగా ఉంటుంది. అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ పథకాలు, ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాల్చగలవు. 
 
వృషభం: ఏసీ, ఇన్వెర్టర్, ఎలక్ట్రానిక్ రంగాలవారికి పురోభివృద్ధి. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందటంతో నిర్మాణ పనులు వేగవంతమవుతాయి. మీ ఉన్నతిని చాటుకోవటం కోసం ధన వ్యయం చేస్తారు. 
 
మిథునం: వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారాభివృద్ధి కానవచ్చినా, పనివారితో చికాకులు తప్పవు. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తగలవు. కుటుంబీకుల ఆరోగ్యంలో మెలకువ వహించండి. ప్రేమికుల మధ్య విబేధాలు తలెత్తుతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి.
 
కర్కాటకం: రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో అనుకూల ఫలితాలుంటాయి. స్థిరాస్తి లేక విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు. రుణాలు, పెట్టుబడులు సకాలంలో అందుతాయి. 
 
సింహం: చేతి వృత్తి వ్యాపారాల్లో మార్పులు కానవస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ఆలయాలను సందర్శిస్తారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. ఏవిషయమైన పూర్తిగా తెలుసుకోకుండా నిర్ధారణకు రావడం మంచిది కాదు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. 
 
కన్య: ఓ చిన్న విహార యాత్ర చేస్తారు. కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి పొందుతారు. ఆకస్మికంగా దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లకు నాణ్యతాలోప నిర్మాణల వల్ల కష్టనష్టాలు ఎదుర్కోవలసివస్తుంది. చిట్ ఫండ్, ఫైనాన్స్ రంగాల వారికి చికాకులు తప్పవు. వృధా ఖర్చులు అధికమవుతాయి.
 
తుల: రియల్ ఎస్టేట్, ఏజెంట్లకు బ్రోకర్లకు కలిసివచ్చేకాలం. దైవ, సేవా సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులు సభా సమావేశాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులు, పెరిగిన ధరలు, కుటుంబ సమస్యలు వేధిస్తాయి. 
 
వృశ్చికం: దంపతుల మధ్య సఖ్యల లోపిస్తుంది. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. క్లిష్ట సమయంలో బంధుమిత్రులు జారుకుంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసివస్తుంది. మీ సంతానం మొండి వైఖరి వల్ల చికాకులను ఎదుర్కొంటారు. 
 
ధనస్సు: ఆర్థిక స్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. వాహన చోదకులకు ఏకాగ్రత అవసరం. దైవదర్శనాల్లో చురుకుగా పాల్గొంటారు. వాయిదా చెల్లింపులకు సంబంధించి ఒత్తిడి ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యకలు చేపట్టే ఆస్కారం వుంది. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. 
 
మకరం: పత్రికా సిబ్బందికి ఉద్యోగభద్రత విషయం ఆందోళన కలిగిస్తుంది. ధనం బాగా ఖర్చు చేస్తారు. సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. బంధువులతో సత్సంబంధాలు సన్నగిల్లుతాయి. అవగాహన లోపం వల్ల మోసపోయే ఆస్కారం వుంది. ప్రయాణాల ఆలోచన విరమించుకోవటం శ్రేయస్కరం.
 
కుంభం: విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో సున్నితంగా మెలగాలి. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు ప్రమోషన్, స్థానచలనం వంటి ఫలితాలున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో మీ శ్రీమతి సలహా పాటించడం మంచిది. స్త్రీలకు వస్త్రప్రాప్తి, వస్తులాభం, శుభకార్యాల్లో ఆదరణ లభిస్తాయి.
 
మీనం: పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

12-05-2019 నుంచి 18-05-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)