Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆదివారం (19-05-2019) మీ రాశి ఫలాలు... పాత రుణాలు...

webdunia
ఆదివారం, 19 మే 2019 (07:42 IST)
మేషం : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి చికాకులు అధికమవుతుంది. వైద్యులకు మెలకువ, ఏకాగ్రత అవసరం. వాతావరణంలో మార్పు తోటల రంగాల వారికి ఆందోళన కలిగిస్తుంది. సేవా, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. మీ కళత్ర మొండితనం చికాకు కలిగిస్తుంది.
 
వృషభం : కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. పత్రిక, ప్రైవేటు సంస్ధలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. వాహనచోదకులకు చికాకులు తప్పవు.
 
మిథునం : ఉద్యోగస్తుల సమర్థత, పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రతి విషయాన్ని మీ శ్రీమతికి తెలియజేయటం మంచిది. ఏజెంట్లకు, బ్రోకర్‌లకు అనుకూలం. ప్రముఖుల కలయిక వాయిదాపడటంతో నిరుత్సాహానికి గురవుతారు. మందులు, రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం.
 
కర్కాటకం : విద్యార్ధినుల మొండితనం అనర్ధాలకు దారితీస్తుంది. సోదరీ, సోదరుల గురించి ఓ రహస్యం తెలుసుకుంటారు. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులుపడటం వల్ల మాటపడతారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. మీ ప్రియతముల పట్ల, ముఖ్యుల పట్ల శ్రద్ద పెరుగుతుంది.
 
సింహం : ఆర్ధిక సమస్యల వల్ల ఒకింత ఆందోళనకు గురవుతారు. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి రాగలవు. కలప, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది.
 
కన్య : ఉపాధ్యాయులు పై అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. మీ సంతానం కోసం ధనం వ్యయం చేస్తారు. రాజకీయాలలో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి. ప్రింటింగ్ రంగాల వారుఅక్షర దోషాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.
 
తుల : విదేశీ ప్రయాణాలకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఫైనాన్సు, చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు సంతృప్తి కానరాగలదు. కళ, క్రీడా, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో పోగొట్టుకున్నది తిరిగి దక్కించుకుంటారు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయద్దు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
వృశ్చికం : భాగస్వామిక సమావేశాలు అర్థాంతంగా ముగుస్తాయి. మీ ఆశయ సిద్ధికి నిరంతర కృషి పట్టుదల ముఖ్యమని గమనించండి. కంప్యూటర్, టెక్నికల్, ఐ.టి. రంగాల్లో వారికి సమస్యలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. నూతన పరిచయాలేర్పడతాయి.
 
ధనస్సు : ప్రభుత్వ రంగ సంస్థల్లో వారికి అధికశ్రమ, పనిభారం అధికం కాగలదు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. మీ విజయానికి మీ స్నేహితుల సహకారం లభించగలదు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో లౌక్యం అవసరం.
 
మకరం : రియల్ఎస్టేట్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. కొబ్బరి, పండ్ల, పానీయ, కేటరింగ్, హోటల్ తినుబండ వ్యాపారులకు శుభదాయకంగా ఉండగలదు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెళకువ వహించండి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు, మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి.
 
కుంభం : దంపతుల మధ్య విభేదాలు తొలగి సఖ్యత నెలకొంటుంది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఒక వ్యవహారంలో బంధుమిత్రులు మీ తీరును తప్పుపడతారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల మక్కువ పెరుగుతుంది.
 
మీనం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి పనిభారం అధికమవుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. షాపింగ్ కోసం ధనం వెచ్చిస్తారు. సాంఘిక, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుభవం లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

19-05-2019 నుంచి 25-05-2019 వరకు మీ రాశిఫలితాలు..