Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

19-05-2019 నుంచి 25-05-2019 వరకు మీ రాశిఫలితాలు..

webdunia
శనివారం, 18 మే 2019 (17:49 IST)
మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. 
ఆర్థిక స్థితి సామాన్యం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. శని, ఆదివారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం చదువులపై దృష్టిపెడతారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. వేడుకలకు హాజరవుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అప్రమత్తంగా ఉండాలి. ధనప్రలోభం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొత్త పరిచయాలేర్పడతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. బెట్టింగులు, పందాల వల్ల ఇబ్బందులు తప్పదు. 
 
వృషభం : కృత్తిక 2, 3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
కొత్త విషయాలపై దృష్టిసారిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. సంతానం సంతోషాన్నిస్తుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. సోమ, మంగళవారాల్లో వాగ్వాదాలు దూరంగా ఉండాలి. ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు. విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పెట్టుబడులకు తరుణం కాదు. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. గత సంఘటనలు పునరావృతమవుతాయి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి మించిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. బుధవారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుకాదు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. అయినవారి ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. సౌమ్యంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సంతానం చదువులపై దృష్టిపెడతారు. విద్యాప్రకటనలను విశ్వసించవద్దు. సంప్రదింపులతో హడావుడిగా ఉంటుంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. వ్యాపారాల్లో ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. 
అంచనాలు ఫలిస్తాయి. మీ నమ్మకం వమ్ముకాదు. వాగ్ధాటితో రాణిస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. గురు, శుక్రవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. లైసెన్సుల, పర్మిట్ల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. చిరు వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం, వైద్య, సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కొత్త విషయాలపై దృష్టిసారిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
వ్యవహారాల్లో మీదే పైచేయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. కష్టం ఫలిస్తుంది. బాకీలు వసూలవుతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. శుభకార్యాన్ని ఘనంగా నిర్వహిస్తారు. మీ అతిథ్యం అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. శనివారం నాడు పనులతో సతమతమవుతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. విద్యాప్రకటలను, దళారులను విశ్వసించవద్దు. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. ఉపాధ్యాయుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
ఖర్చులు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. సాయిం చేసేందుకు అయినవారే సందేహిస్తారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. సంప్రదింపులకు అనుకూలం. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆది, సోమవారాల్లో పనులు సాగక విసుగు చెందుతారు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టుగా వదిలేయండి. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. శుభకార్యంలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం, రిప్రజెంటేటివ్‌లకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరకు నిల్వలో జాగ్రత్త. వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
ఈ వారం అనుకూలదాయకమే. శుభకార్యాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. వాగ్ధాటితో రాణిస్తారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారం కావు. ఆప్తులకు సాయం చేస్తారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఆశ్చర్యకరమైన ఫలితాలెదురవుతాయి, సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట. 
వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అనేక పనులతో సతమతమవుతారు. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించడి. అనవసర జోక్యం తగదు. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. విద్యాప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఊహించని ఫలితాలెదురవుతాయి. వాహనం ఇతరులకివ్వొద్దు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
అనుకూల పరిస్థితులున్నాయి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చులు విపరీతం, అవసరాలు నెరవేరుతాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మంగళ, బుధవారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆప్తుల సలహా పాటించండి. వేడుకలకు హాజరవుతారు. మీ రాక బంధువులను సంతోషపరుస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనుల్లో అవాంతరాలెదురవుతాయి. గురు, శుక్రవారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. పెద్దల సలహా పాటించండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. బెట్టింగుల జోలికి వెళ్లొద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. రుణ బాధలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఊహించని ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. శనివారం నాడు అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. ఆత్మీయుల ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభకార్యానికి హాజరవుతారు. సంతానం వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుకాదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు శ్రమ అధికం. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. నిరుద్యోగుకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. 
సమర్థతను చాటుకుంటారు. కృషి ఫలిస్తుంది. బాధ్యతలు అధికమవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతనవుండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ ప్రమేయంతో శుభాకార్యం నిశ్చయమవుతుంది. పనులు సానుకూలమవుతాయి. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీరంటే గిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. కొన్ని ఫలితాలు ఊహించినట్టే ఉంటాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

రావి ఆకులపై ప్రమిదను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే?