Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిట్నెస్ సాధించిన జాదవ్.. అంబటికి మొండిచేయి.. వరల్డ్ కప్ ఫైనల్ టీమ్ ఇదే..

Webdunia
మంగళవారం, 21 మే 2019 (09:40 IST)
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఈ నెల 30వ తేదీ నుంచి ప్రపంచ క్రికెట్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల కోసం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మందితో జట్టును పంపించింది. ఆ తర్వాత మరో ఇద్దరు ప్లేయర్లను స్టాండ్‌బైగా తీసుకుంది. అయితే, బీసీసీఐ తొలుత ప్రకటించిన జట్టునే ప్రపంచ కప్ పోటీలు అడేందుకు తుది జట్టుగా ఖరారు చేసింది. 
 
ముఖ్యంగా, ఐపీఎల్ 11వ సీజన్ పోటీల్లో గాయపడిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్‌ తిరిగి ఫిట్నెస్ సాధించడంతో అతనికి తుది జట్టులో స్థానం కల్పించింది. జాదవ్ జట్టులోకి రావడంతో హైదరాబాద్ కుర్రోడు అంబటి రాయుడుకు తుది జట్టులో స్థానం లేకుండా పోయింది. ఫలితంగా రాయుడు తీవ్ర నిరాశకు లోనయ్యాడు. 
 
బీసీసీఐ ప్రకటించిన తుది జట్టులోని సభ్యుల వివరాలను పరిశీలిస్తే, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ (సెకండ్ వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments